Naga Vamsi: తాజాగా ఆంధ్రప్రదేశ్లో మహానాడు సభలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. టీడీపీ పార్టీ ప్రతి ఏడాది పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కడపలో మహానాడు సభలు జరుగుతున్నాయి. ఇప్పటికే మహానాడుకు సంబంధించి ఎన్నో విశేషాలు బయటకు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే టిడిపి పార్టీకి భారీగా విరాళాలు కూడా వచ్చాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టాలీవుడ్ సినీ నిర్మాత అయినటువంటి నాగ వంశీ (Naga Vamsi) రూ.25 లక్షల విరాళం ఇవ్వడం..అయితే తెలంగాణకు చెందిన నిర్మాత నాగ వంశీ ఆంధ్రప్రదేశ్ కి భారీ విరాళం ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకీ నాగ వంశీ అంత పెద్ద మొత్తంలో టీడీపీ పార్టీకి ఎందుకు విరాళం ఇచ్చారు.. దీని వెనుక ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
టీడీపీ పార్టీకి రూ.25 లక్షలు విరాళం..
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని హిట్స్ అయితే కొన్ని ఫ్లాప్స్. అయితే హిట్స్ ఫ్లాప్ అనే విషయం పక్కన పెడితే.. నిర్మాత నాగ వంశీ తాను నిర్మించే ప్రతి ఒక్క సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొని వివాదాల పాలవుతుంటారు. అలా ‘డాకు మహారాజ్’ సినిమా సమయంలో చిరంజీవి సినిమాను తక్కువ చేసి వివాదంలో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే తాజాగా టిడిపి పార్టీ కోసం విరాళాలు అందించిన వారి పేర్లను మహానాడు సభలో చంద్రబాబు నాయుడు బయటపెట్టారు.అయితే ఇందులో రూ.25 లక్షల విరాళాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత నాగవంశీ ఇవ్వడంతో ఈ పేరును స్వయంగా చంద్రబాబు నాయుడు బయట పెట్టారు.దీంతో నాగ వంశీ అంత పెద్ద మొత్తంలో విరాళం ఎందుకు ఇచ్చారు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.
నిర్మాత నాగ వంశీ విరాళంపై అనుమానాలు..
అయితే ఇంకొంత మందేమో ఇస్తే గిస్తే జనసేన పార్టీకి నాగవంశీ విరాళం ఇవ్వాలి. ఎందుకంటే నాగవంశీ త్రివిక్రమ్ తో చాలా సన్నిహితంగా ఉంటారు. ముఖ్యంగా త్రివిక్రమ్ భార్య సౌజన్య కూడా నాగ వంశీ చేసే కొన్ని సినిమాల్లో సహనిర్మాతగా వ్యవహరిస్తుంది.అలా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లతో సన్నిహితంగా ఉండే నాగవంశీ జనసేన పార్టీకి విరాళం ఇవ్వకుండా అలా టిడిపి పార్టీకి విరాళం ఇచ్చారేంటి అని చాలామంది ఆశ్చర్యంలో మునిగిపోయారు.. ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నాగ వంశీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నిర్మాత కూడా కాదు. ఆయన ఖమ్మంలో పుట్టి పెరిగారు.అలాంటిది తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్ పార్టీకి విరాళం ఇవ్వడం ఏంటి అని చాలామంది సోషల్ మీడియా జనాలు నాగ వంశీ ఇచ్చిన 25 లక్షల విరాళం మీదే మాట్లాడుకుంటున్నారు. అయితే టిడిపి పార్టీ మీద ఉన్న అభిమానంతోనే నాగ వంశీ అంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చినట్టు కొంతమంది నాగ వంశీ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా నిర్మాత ఒక పర పార్టీ కోసం రూ.25 లక్షలు ఇవ్వడం ప్రశంసనీయమని చెప్పవచ్చు.