Big Stories

MP Venkatesh Netha : బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ వెంకటేశ్ నేత

MP Venkatesh netha joins Congress(TS Politics): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకూ కుటుంబపాలన సాగిన రాష్ట్రంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలతో పాటు.. నేతలు కూడా మార్పు కోరుకుంటున్నారు. తమను పట్టించుకోని పార్టీకి గుడ్ బై చెప్పి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.

- Advertisement -

తాజాగా.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత.. కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి.. కేసీ వేణుగోపాల్ ఇంటికెళ్లారు ఎంపీ వెంకటేష్. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. వెంకటేశ్ ను పార్టీలోకి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు.

- Advertisement -

ఎంపీ వెంకటేష్ తో పాటు పలువురు కూడా కాంగ్రెస్ లో చేరారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కొడుకు, MSN ల్యాబ్స్ డైరెక్టర్ మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం ఆ పార్టీకి భారీ నష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాగా.. ఎంపీ వెంకటేష్ 2019 లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి.. బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. తాజాగా బీఆర్ఎస్ ను వీడి.. మళ్లీ హస్తం గూటికి చేరారు. జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో.. ఆయన మళ్లీ పెద్దపల్లి నుంచే కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News