Medak News: మెదక్ బ్యూరో, స్వేచ్ఛ : శివనామస్మరణలతోఏడుపాయల గుట్టలు మార్మోగాయి. ఏడు పాయలుగా ప్రవహించే మంజీరా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, ఉపవాసదీక్షలుప్రారంభించారు. ఆదివారం తెల్లవారు జామున ఆలయ అర్చకులు మూలవిరాట్ వనదుర్గ అమ్మవారి విగ్రహానికి అభిషేకం నిర్వహించి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరించిఏడుపాయల్లో ప్రత్యేకపూజలుప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలను ఆదివారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు, అదనపు కలెక్టర్ నగేష్ లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించి జాతర ఉత్సవాలను ప్రారంభించారు.
వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది భక్తులు మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏడుపాయలకు చేరుకున్నారు, మంజీరా పాయల్లో పుణ్య స్నానాలు చేసి శివరాత్రి ఉపవాస దీక్షలు చేపట్టారు. చాలా మంది ఉపవాస దీక్షలు చేపట్టాలనే ఉద్దేశంతో రాత్రే ఏడుపాయలకు చేరుకోగా, మరికొంత నుంది తెల్ల వారు జామునే ఏడుపాయలకు చేరుకున్నారు. ఉదయం. నుండి గంట గంటకు ఏడుపాయలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పోతంశెట్టిపల్లి వైపు నుండి వచ్చిన భక్తులు రెండవ బ్రిడ్జి వద్ద పార్కింగ్ ప్రదేశంలో తమ వాహనాలను నిలిపి ఒక కిలోమీటర్ పొడవున నడుచుకుంటూ ఏడుపాయలకు చేరుకున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక, జహీరాబాద్, నారా యణఖేడ్ తదితర ప్రాంతాల వారు నాగ్సాన్పల్లి వైపు గల ఏడుపాయల కమాన్ మీదుగా ఏడుపాయలకు చేరుకు న్నారు. నాగ్సాన్పల్ల వైపు నుండి వచ్చే భక్తులు వాహనాలు చల్మెల కుంట వద్ద పోలీసులు నిలిపి వేయడంతో కొంతమేర భక్తులకు ఇబ్బందులు ఎదురకోవల్సి వచ్చింది. ఆలయానికి చేరుకోవడానికి ఒక కిలోమీటర్ మేర నడవాల్సి రావడంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు ఎదుర్కు న్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మూడు రోజుల పాటు ఏడుపాయల్లో ఉండే విధంగా మూటముల్లెతో చేరుకున్నారు. ఏడుపాయల్లో భక్తులు ఉండటానికి ధర్మ సత్రాలు అందుబాటులో లేనం దున వారి వెంట తెచ్చుకున్న టెంట్లు, డేరాలు, గుడిసెలు వేసుకుని అందులో రెండు మూడు రోజుల పాటు కాలం వెల్లదీసి వెల్లడానికి సిద్ధమై వచ్చారు.
Also Read:Cm Revanth reddy : సీఎం రేవంత్ టాస్క్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి?
మరికొందరు తాము రవాణా కోసం తెచ్చుకున్న లారీలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, ఆటోల మీదే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. భక్తులు మొదటి రోజు ఏడుపాయల్లో ఉపవాస దీక్షలు చేపట్టి మరుసటి రోజు బండ్లు తిరిగే కార్యక్రమంలో పాల్గొని రభోత్సవం ముగిశాక తమ ఇండ్లకు తిరిగి ప్రయాణం చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్ నుండి పోతంశెట్టిపల్లి వైపు నుండి బస్సులలో వచ్చే భక్తుల కోసం ఏడుపాయల వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఏడుపాయల పరిసర ప్రాంతాల లోని వివిధ గ్రామాల ప్రజలు మూటముళ్లే సర్దుకుని తండోపతందాలుగా ఏడుపాయలకు తరలి వచ్చారు. ఉదయం అంతంత మాత్రంగా ఉన్న భక్తుల సంఖ్య సాయంత్రానికి భారీ స్థాయికి చేరుకుంది. ఆనకట్టపై ప్రమాదాలు జరగకకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ గా జాలిలతో బారికేడ్లను కట్టి దారిని మూసివేశారు.
వనదుర్గా దేవి ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. రకరకాల పూలతో ఆలయ ప్రాంగణం మొత్తం మహా అద్బు తంగా అలంకరించారు. ఆలయ మంటపం ప్రధాన ద్వారం వద్ద అమ్మవారి రూపంలో పూలతో అలంకరించడం భక్తులకు ముచ్చట గొలిపింది. ఆలయ మంటపం వెలుపల రంగు రంగుల పూలతో అలంకరించారు.ఫ్లడ్ లైట్ల..రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణ భక్తులను ఆకర్షిస్తుంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చర్యలు తీసుకున్నారు. అమ్మవారి మూల విరాట్ విగ్రహాన్ని సైతం జాతర ఉత్సవాలను పురస్కరించుకుని బంగారు కిరీటం, బంగారు ఆభరణాలతో అలంకరించారు.
ఏడుపాయల జాతర ఉత్సవాలకు సుమారు 10 లక్షల పై చిలుకు మంది భక్తులు రానున్నారన్న అంచనాలతో సంబంధిత అధికారులు సకల సౌకర్యాలతో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల స్నానాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగూర్ ప్రాజెక్టు నుండి నీటిని వనదుర్గా ప్రాజెక్టుకు విడుదల చేశారు. దీంతో భక్తుల స్నానాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఘనపురం ఆనకట్ట , అమ్మవారి ఆలయం, చెక్ డ్యామ్ తదితర ప్రాంతాలలో, షవర్ల వద్ద స్నానాలు ఆచరించారు. భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు ఎదురవ్వకుండా నల్లాలతో పాటు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించారు.
నీరు కలుషితం కాకుండా సంబంధిత వైద్య సిబ్బంది మనపురం అనకట్ట, చెక్ డ్యాం తదితర ప్రాంతాలలో క్లోరినేషన్ చేశారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్ల తోపాటు బాయో టాయిలెట్స్ సైతం ఏర్పాటు చేశారు. జారతలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. వన దుర్గ మాతకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దంపతులు పట్టు వస్త్రుల సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడుపాయల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు, నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఏడుపాయల వన దుర్గామాతను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ దంపతులు జాతర ప్రారంభం రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. డేగకన్నుల తో నిఘా గట్టి భద్రత… ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ వీరేశం చంద్ర శేఖర్,సూర్య శ్రీనివాస్,పూజారులు శంకర్ శర్మ,పార్టివ శర్మ,తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట,మాజీ చైర్మన్ పబ్బతి ప్రభాకర్ రెడ్డి,గోవింద్ నాయక్,ప్రశాంత్ రెడ్డి,భారత్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ మహేందర్ పర్యవేక్షించారు. ఉదయం నుంచే మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఇరువురు డీఎస్పీలు, ఎనిమిది సీఐ లు అనుక్షణం జాతర పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణ చేస్తూ భక్తుల భద్రత ను అనుక్షణం పరిశీలిస్తూన్నారు. దీంతో పాటు సీసీ కెమెరాల తో డేగకన్నుల నిఘాతో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Also Read: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బీఎండబ్ల్యూ బైక్ అదుపుతప్పి యువకుడు మృతి