E-Paper
Advertisement

BRS Party: కాంట్రవర్సీలపై గులాబీ దృష్టి.. అధికార పక్షంకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని వ్యూహం?

BRS Party: కాంట్రవర్సీలపై గులాబీ దృష్టి..  అధికార పక్షంకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని వ్యూహం?
Advertisement

BRS Party: గులాబీ అధిష్టానం పార్టీలోని కాంట్రావర్సీ నేతలపై దృష్టిసారించింది. ఎవరెవరు తరచూగా వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు..వారితో పార్టీకి జరుగుతున్న నష్టంపై ఆరా తీస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందనుకున్న తరుణంలో వివాదాలకు కారణమవుతున్న వారిని పక్కను పెట్టేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే అలాంటి నేతలను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.

పార్టీ నేతలపై అధిష్టానం దృష్టి

ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుంది. అయితే పార్టీకి చెందిన కొంతమంది నేతలతో డ్యామేజ్ అవుతుంది. పార్టీని బలోపేతం చేద్దామనుకున్న తరుణంలో ఇరుకున బెట్టినట్లు అవుతుంది. దీంతోతరచూ వివాదాల్లో నిలుస్తున్న పార్టీ నేతలపై అధిష్టానం దృష్టిసారించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ నేతల వ్యవహారశైలీతోనే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని పార్టీ నేతలే బహిరంగంగా పేర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటికి వారి తీరులో మార్పు రావడం లేదని, వారికి చెక్ పెడితేనే నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందని, కేడర్ లోనూ పార్టీపై అసంతృప్తి పోతుందని, వర్గాలకు సైతం చెక్ పెడుతుందని, దీంతో పార్టీకి ఆదరణ వస్తుందని భావిస్తుంది. అందుకే కాంట్రవర్సీ నేతలు ఎవరెవరు అనేదానిపై ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Also RadCongress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!

 కాంట్రవర్సీ నేతలు ఎవరెవరు

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మొయినాబాద్ ఫాం హౌజ్ లో 100కోట్ల ఎమ్మెల్యేల కొనుగోలుకు ఉదంతం సంచలనం సృష్టించింది. దీంతో రోహిత్ రెడ్డి కీలకమని ప్రచారం జరిగింది. గత వారం రోజుల క్రితం మళ్లీ అదే ఫాం హౌజ్ లో డ్రగ్స్ పట్టుబడింది. దీంతో ప్రభుత్వానికి ఆయుధం ఇచ్చినట్లయింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తరుణంలో రోహిత్ రెడ్డి తీరుతో డ్యామేజ్ అయినట్లు పార్టీ భావిస్తుంది. ఆయన వివరణ సైతం కోరింది. అయితే ఇలాంటి నేతలు ఎవరెవరు ఉన్నారని వివరాలు సేకరిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా మాజీ, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, నేతల పై ఆరా తీస్తుంది. వారి బిజినెస్ లు, వ్యవహారశైలీ తదితర వివరాలను సేకరిస్తుంది. పార్టీ ద్వితీయ స్థాయి నేతలు, కేడర్ తో వారు అనుసరిస్తున్న తీరును సైతం పరిశీలిస్తుంది.

నేతలు భేటీ  హాట్ టాపిక్

Advertisement

మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని, పార్టీని డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన నేతలు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. అంతేకాదు పార్టీ నేతలను కలుపుకుపోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. కౌశిక్ దూకుడు ఇప్పటికే పార్టీకి డ్యామేజ్ చేస్తుందని రాజకీయ వర్గాలతో పాటు పార్టీలోనూ చర్చజరుగుతుంది. ఇలా మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఏ నేత ఎలా వ్యవహరించారు.. అనుకున్న స్థానాలను గెలుచుకోకపోవడానికి కారణం ఏంటనేది సైతం వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. రోజుకో నేతపై ఫిర్యాదులు కేడర్ నుంచి వస్తుండటంతో పార్టీని గాడిలో పెట్టాలంటే నేతలకు చెక్ పెట్టాలని, ఒకేసారి కాకుండా పొమ్మనలేక పొగ అనే రీతిలో ఉండేలా ప్రణాళికతో దూరం పెట్టబోతున్నట్లు సమాచారం. అధికారపక్షంకు ఎట్టిపరిస్థితుల్లో విమర్శలకు తావివ్వొద్దని భావిస్తుంది. అందుకే వివాదాలకు కారణమవుతున్న నేతలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో నేతల తీరుపై పార్టీ అధిష్టానానికి కేడర్ ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిపై దృష్టిసారించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గాల్లో ప్రక్షాళనకు సిద్ధమవుతుంది. అయితే ఎవరెవరికి చెక్ పెడుతుందనేది మాత్రం చూడాలి.

Also Read: Oppo Pad Mini: రూ.30వేల బడ్జెట్‌లో ఒప్పో ప్యాడ్ మినీ.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్‌తో వస్తోంది!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×