BigTV English

Rajinikanth: మహారాజకు తలైవా ప్రశంసలు.. డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ..

Rajinikanth: మహారాజకు తలైవా ప్రశంసలు.. డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ..

Rajinikanth: ఒక మంచి సినిమా వస్తే దాన్ని ప్రశంసించడంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. సినిమా రిలీజ్ అయ్యి కొంచెం లేట్ అయినా కూడా ఆ సినిమాను చూసి.. నచ్చితే రజినీ కచ్చితంగా సోషల్ మీడియాలో కానీ, వారిని ఇంటికి పిలిచి మరీ అభినందిస్తారు. తాజాగా మహారాజ సినిమాపై రజినీ ప్రశంసలు కురిపించారు.


విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ. 107 కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా తన సత్తా చాటింది. కూతురుకు జరిగిన అన్యాయానికి ఒక తండ్రి ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది కథ.

ఇక ఈ సినిమాను రీసెంట్ గానే రజినీకాంత్ వీక్షించినట్లు తెలుస్తోంది. మహారాజ సినిమాను మెచ్చిన తలైవా.. డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ ను స్వయంగా ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఇక ఈ విషయాన్ని నిథిలన్ స్వామినాథన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.


” ప్రియమైన సూపర్ స్టార్ రజినీకాంత్ సర్.. మీ అద్భుతమైన సమావేశానికి నా ధన్యవాదాలు. ఈ కొంత సమయంలోనే మీ దగ్గరనుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. మీతో మాట్లాడుతుంటే జీవితం, అనుభవం, జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం వంటి బంగారు నవల చదివినట్లుగా ఉంది. మీ ఆతిథ్యం మరియు వినయం చూసి నేను ఆశ్చర్యపోయాను. మీరు మహారాజను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకుని ముచ్చటపడ్డాను. మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తలైవర్ లాంగ్ లైవ్” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×