OTT Movie : వాంపైర్ సినిమాలలో బ్లడ్ బాత్ ఎక్కువగానే ఉంటుంది. వీళ్ళు మనుషుల రూపంలో ఉండి, రక్తాన్ని రుచి మరిగి మనుషుల్ని చంపుతుంటారు. అయితే ఈ సినిమాలు చూడటానికి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఈ జానర్ లో వచ్చే సినిమాలు, ఆడియన్స్ ని భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కథ వాంపైర్ చేతికి చిక్కే ఒక అమాయకుడి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకివెళ్తే ..
‘నైట్ టీత్’ (Night teeth) లో వచ్చిన అమెరికన్ వాంపైర్ థ్రిల్లర్ సినిమా. ఆడమ్ రాండాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జార్జ్ లెండెబోర్గ్, డెబ్బీ ర్యాన్, లూసీ ఫ్రై, రాల్ కాస్టిలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇనిమా 2021 అక్టోబర్ 20న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఇంగ్లీష్ తెలుగు, హిందీ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది.
బెన్నీ అనే ఒక కాలేజ్ స్టూడెంట్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడు. దీంతో డబ్బు సంపాదించడానికి రాత్రి డ్రైవర్‌గా పని చేస్తాడు. అతని సోదరుడు జే కూడా టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అయితే ఒక రోజు బెన్నీ కి బ్లైర్, జో అనే ఇద్దరమ్మాయిలను లాస్ ఏంజిల్స్‌లో పార్టీకి తీసుకెళ్లమని ఆర్డర్ వస్తుంది. మొదట బెన్నీ వాళ్లతో ఫన్నీగా మాట్లాడుకుంటూ, పార్టీలకు తిరుగుతాడు. కానీ వాళ్ళతో తిరుగుతున్నప్పుడు బ్లైర్, జో వాంపైర్స్ అని తెలుస్తుంది. వాళ్లు పార్టీలలో మనుషులను చంపి రక్తం తాగుతారు. ఆ సంఘటన చూసి బెన్నీ భయపడతాడు. కానీ వాళ్లు ఇంతలోనే అతన్ని తమ ప్లాన్‌లో ఇరికించేస్తారు.
అతన్ని వాంపైర్ ప్రపంచంలోకి తెసుకెళ్తారు. ఈ లోకంలో వాంపైర్స్, మనుషులు ఒక ఒప్పందంతో శాంతియుతంగా ఉంటారు, కానీ బ్లైర్, జో వాంపైర్ రూల్స్ బ్రేక్ చేస్తారు. వాళ్లు మనుషులను చంపడం మొదలెడతారు, దీంతో వాంపైర్ గ్యాంగ్స్ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఈ సమయంలో బెన్నీ తన సోదరుడు జే గురించి తెలుసుకుంటాడు. ఆశ్చర్యంగా అతను కూడా ఒక వాంపైర్ అని తెలుస్తుంది. బెన్నీ, జే కలసి వాంపైర్ గ్యాంగ్స్ తో ఫైట్ చేస్తారు. అయితే బ్లైర్, జో తో వాళ్ళకి లవ్ ట్రాక్ మొదలవుతుంది. దీంతో కథ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఈ వాంపైర్స్ నుంచి బెన్నీ తప్పించుకుంటాడా ? వీళ్ళ లవ్ ట్రాక్ ఏమవుతుంది ? ఈ కథ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.