Illu Illaalu Pillalu Prema : తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. సినిమా స్టోరీ లో నుంచి నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ అదిరిపోయే స్టోరీలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. స్టార్ మాలో ప్రసారమవుతున్న అన్ని సీరియల్స్ తెలుగు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఈ మధ్య ప్రారంభమైన కొత్త నాటిక ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ప్రస్తుతం మాత్రమే ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇందులో రామరాజు రెండవ కోడలు పాత్రలో ప్రేమ నటించింది. ఆమె నటన అద్భుతంగా ఉంది అనడంలో సందేహం లేదు. ఈ పాత్రలో లావణ్య భరద్వాజ్ నటించారు.. ప్రస్తుతం ఈమె లవ్ స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అదేంటంటే..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తున్న ప్రేమ అసలు పేరు లావణ్య భరద్వాజ్.. ఈమె కన్నడ నటి. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో శశిరేఖ పరిణయం వంటి టాప్ సీరియల్ లో నటించిన తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈమె సీరియల్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, ఫ్యామిలీ గురించి చాలామందికి తెలిసి ఉండదు. కన్నడ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో తన సహ నటుడైన శశి కుమార్ ను ప్రేమించి పెద్దలను ఒప్పించి 2022లో పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం తెలుగులో వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశం అందుకుంటూ బిజీగా గడుపుతుంది..
Also Read : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు..
ఈమధ్య యాక్టర్స్ తమతో పాటు నటిస్తున్న వారితో సన్నిహితం ఏర్పడటం, ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారడం, ఇక పెళ్లి కన్నా ముందు డేటింగులు అంటూ ఇద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉండడం వంటివి వినిపిస్తూనే ఉన్నాయి. కొన్నేళ్లపాటు ఇద్దరూ కలిసి ఉన్న తర్వాత తమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకుంటే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే వీళ్లిద్దరు కూడా కలిసి పని సీరియస్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. వీరిద్దరి లవ్ స్టోరీ కాస్త డిఫరెంట్ గా ఉండడంతో మొదట ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదని ఓ వార్త వినిపిస్తుంది. కొన్నేళ్లపాటు ఇద్దరూ డేటింగ్ లో ఉండి ఆ తర్వాత ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వీరిద్దరూ కెరియర్ పై ఫోకస్ పెట్టి లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు.. ప్రస్తుతం ఈమె ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తుంది.. ఇక సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా కొన్ని నింపేస్తూ వస్తుంది.