OTT Movie : రివెంజ్ థ్రిల్లర్ సినిమా అభిమానులకు సరిగ్గా సరిపోయే కథ ఇది. ఈ హాలీవుడ్ సినిమా హీరో తన తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఒక ఉచ్చులో పడతాడు. చివరికి అతను రివెంజ్ ను ఎలా తీర్చుకుంటాడనేదే ఈ కథ. ట్విస్టులు , సస్పెన్స్ తో ఈ స్టోరీ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘బ్లూ రూయిన్’ (Blue ruin) 2013లో వచ్చిన అమెరికన్ రివెంజ్ థ్రిల్లర్ సినిమా. జెరెమీ సాల్నియర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మాకాన్ బ్లెయిర్, లింక్ లెటర్, అమీ హార్గ్రీవ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈసినిమా 2014 ఏప్రిల్ 25న అమెరికాలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 7.1/10 రేటింగ్ పొందింది.
డ్వైట్ అనే వ్యక్తికి ఎవరూ ఉండరు. అతని తల్లిదండ్రులు ఇరవై సంవత్సరాల క్రితం హత్యకి గురయ్యారు. దీంతో అతను ఒంటరిగా ఒక బీచ్ దగ్గర బిచ్చమెత్తుకుంటూ ఒక పాత కారులో జీవిస్తుంటాడు. ఒక రోజు అతనికి ఒక వార్త అందుతుంది. అతని తల్లిదండ్రులను చంపిన వాలెర్ అనే వ్యక్తి, జైలు నుంచి విడుదల అవుతున్నాడని తెలుస్తుంది. డ్వైట్ రివెంజ్ తీర్చుకోవడానికి తన పాత ఊరికి వెళ్తాడు. అతను గన్ కొని, వాలెర్‌ను చంపడానికి ప్లాన్ చేస్తాడు. అయితే డ్వైట్‌కు గన్ ఉపయోగించడం రాదు. అయినా కూడా అతను వాలెర్‌ను చంపేస్తాడు. కానీ ఈ చంపడం వల్ల డ్వైట్ పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. వాలెర్ ఫ్యామిలీ డ్వైట్‌ను వెతకడం మొదలెడుతుంది.
Read Also : కళ్ళముందే తల్లిదండ్రుల ఊచకోత… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈగోను శాటిస్ఫై చేసే రివేంజ్ డ్రామా
వాలెర్ తండ్రి డ్వైట్‌ను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తాడు. డ్వైట్ భయపడి తన పాత ఫ్రెండ్ జిమ్ దగ్గరకు వెళ్తాడు. ఈ సమయంలో డ్వైట్‌కు జిమ్ ధైర్యం చెప్పి గన్ ఫైరింగ్ నేర్పుతాడు. ఇక ధైర్యంగా డ్వైట్ వాలెర్ ఫ్యామిలీతో పెద్ద ఫైట్ చేస్తాడు. అతను గోడవలో వాలెర్ తండ్రిని కూడా చంపుతాడు. కానీ ఈ ప్రతీకారం వల్ల డ్వైట్ జీవితం మరింత బాధతో నిండిపోతుంది. అతను మనుషుల ప్రాణాలు తీసినందుకు ఫీల్ అవుతాడు. ఈ రివెంజ్ థ్రిల్లర్ సినిమా, ఒక ఎమోషనల్ ఎండింగ్‌తో ముగుస్తుంది.