OTT Movie : ఒక చైనీస్ ఇన్ స్పైరింగ్ రియల్ స్టోరీ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది హాంగ్‌కాంగ్‌లో వాన్ చై పియర్ డంప్లింగ్ కంపెనీ స్థాపించిన జాంగ్ జియాన్‌హె నిజ జీవిత కథ నుండి స్ఫూర్తి పొందింది. ఇది ఒక సింగిల్ మదర్ తన కుమార్తెలను పెంచుకుంటూ, డంప్లింగ్ వ్యాపారంతో సక్సెస్ సాధించిన అద్భుతమైన కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘ది డంప్లింగ్ క్వీన్’ (The dumpling queen) 2025లో వచ్చిన చైనీస్ బయోపిక్ సినిమా. ఆండ్రూ లావు దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో లూ మా, కారా హ్యూయ్, జూ యావెన్, బెన్ యుయెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 30న చైనా, హాంగ్‌కాంగ్‌లో లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్లెక్స్, ముబీ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDb లో 6.3/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా చైనీస్ భాషలో ఉంది. తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో కూడా అందుబాటులో ఉంది.
ఈ కథ 1970కాలం నాటి చైనాలోని చిందావోలో మొదలవుతుంది. జాంగ్ జియాన్ ఒక మామూలు మహిళ, తన భర్తతో హాంగ్‌కాంగ్‌కు వెళ్లాలని కలలు కంటుంది. కానీ ఆమె భర్త ఆమెను, వాళ్ల ఇద్దరు చిన్న కుమార్తెలను వదిలేసి పారిపోతాడు. ఈ షాకింగ్ ఘటనపై ఆమె చాలా బాధపడుతుంది. జియాన్ ఒంటరిగానే హాంగ్‌కాంగ్‌కు వస్తుంది. వస్తే వచ్చింది కానీ అక్కడ ఆమెకు డబ్బు లేదు, ఇల్లు లేదు, జాబ్ కూడా లేదు. ఆమె కుమార్తెలను పెంచడానికి రోజూ చిన్న చిన్న పనులు చేసేది. బతకడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ జియాన్ మొండి ధైర్యంతో జీవితంతో పోరాడుతుంది.
ఈ సమయంలో ఆమెకు వచ్చిన ఐడియా తన జీవితాన్నే మార్చేస్తుంది. తన కుమార్తెల కోసం ఆమె డంప్లింగ్ అమ్మే వ్యాపారం మొదలెడుతుంది. మొదటలో ఎవరూ దానిని కొనరు, కానీ ఆమె వదలకుండా ట్రై చేస్తుంది. ఆమె డంప్లింగ్స్ చాలా రుచిగా ఉంటాయి. కానీ కస్టమర్లు మాత్రం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరూ వస్తుంటారు. జియాన్‌హె రోజూ కష్టపడుతూ, కుమార్తెలను చూసుకుంటూ, వ్యాపారాన్ని కొంచెం కొంచెం పెంచుతుంది. జియాన్ తన డంప్లింగ్ వ్యాపారాన్ని హాంగ్‌కాంగ్‌లో చాలా పెద్ద సక్సెస్‌గా మారుస్తుంది. ఆమె ‘డంప్లింగ్ క్వీన్’ గా ఫేమస్ అవుతుంది. ఆమె కుమార్తెలు కూడా బాగా చదువుకుని స్థిరపడతారు. ఈ సినిమా హార్ట్ టచ్ మూమెంట్ తో ముగుస్తుంది.