BigTV English

Mancherial : మహిళకు వేధింపులు.. పట్టపగలే యువకుడి దారుణ హత్య..

Mancherial : మహిళకు వేధింపులు.. పట్టపగలే యువకుడి దారుణ హత్య..

Mancherial : మంచిర్యాల జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తూడంటూ..ఓ యువకుడ్ని ఓ కుటుంబం అత్యంత దారుణంగా హత మార్చింది. బండరాయితో కొట్టి హత్య చేసింది. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి బాధిత మహిళ ఆ యువకుడిని చంపేసింది.

జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో ఈ దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు….ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వివాహితను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. బాధితురాలు గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. అయినా సరే మహేశ్ నుంచి వేధింపులు ఆగకపోవడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.


ఊరంతా చూస్తుండగానే మహేష్ ను కిరాతకంగా హత్య చేశారు. అతడు బైక్‌ వెళుతుండగా అడ్డగించి దాడికి దిగారు. తొలుత గొంతు కోశారు. ఆ తర్వాత బండరాయితో తల పగులకొట్టారు. ఆ సమయంలో స్థానికులు ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి మహేష్‌ను చంపినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యపై విచారణ చేపట్టారు. మహేష్‌ను చంపిన నలుగురు నిందితులను తమకు అప్పగించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×