
WTC Final : ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేసిన సూర్య కుమార్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కలేదు. గతంలో జట్టులో చోటు కోల్పోయి ప్రస్తుతం ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న రహానెకు జట్టులో స్థానం దక్కింది. తెలుగు కుర్రోడు కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా అవకాశం దక్కించుకున్నాడు. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.
ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ స్థానం పదిలం చేసుకున్నాడు. పుజారా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటర్ల స్థానాలకు ఎంపికయ్యారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ , రవీంద్ర జడేజా , అక్షర్ పటేల్ కు చోటు కల్పించారు. పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్ జట్టుకు ఎంపికయ్యారు.
WTC ఫైనల్ కు ఆస్ట్రేలియా, భారత్ జట్లు చేరుకున్నాయి. జూన్ 7న ఓవల్ మైదానంలో ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభమవుతుంది. జూన్ 11 వరకు కొనసాగుతుంది. జూన్ 12ను రిజర్వ్ డేగా ప్రకటించారు.
భారత జట్టు ఇదే : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్.