E-Paper
Advertisement

హైదరాబాద్‌లో దారుణం.. ఓ యువకుడ్ని క్రూరంగా చంపిన గంజాయి బ్యాచ్, పారిపోతుండగా ఆ పని చేసి మరీ

హైదరాబాద్‌లో దారుణం.. ఓ యువకుడ్ని క్రూరంగా చంపిన గంజాయి బ్యాచ్, పారిపోతుండగా ఆ పని చేసి మరీ
Advertisement

Hyderabad City: హైదరాబాద్ శివారులో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడ్ని అత్యంత దారుణంగా హత్య చేసింది గంజాయ్ బ్యాచ్. తనను చంపవద్దని ప్రాధేయపడి పారిపోతున్నా ఏ మాత్రం కనికరించలేదు. యువకుడి ప్రైవేటు పార్ట్స్‌పై దాడి చేసి క్రూరంగా చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది?

హైదరాబాద్ శివారులో దారుణమైన ఘటన-హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పసుమాముల ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల నిషాని సుహాస్‌‌ను దారుణంగా కొట్టి చంపింది గంజాయ్ బ్యాచ్. గంజాయి వ్యాపారంలో లావాదేవీలు దీనికి కారణమైనట్టు తెలుస్తోంది. నిందితుల్లో ఒకర్ని పోలీసులు విచారించారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

హయత్ నగర్‌లో ఓ యువకుడ్ని చంపిన గంజాయ్ బ్యాచ్-సుహాస్ ఫ్యామిలీ తొలుత సికింద్రాబాద్‌లో నివాసం ఉండేది. 22 ఏళ్ల కొడుకు నిషాని సుహాస్‌‌ చెడు స్నేహం చేస్తున్నాడని అతడి తల్లి నందిని తెలుసుకుంది. హయత్‌నగర్ సమీపంలోని పసుమాములలో సొంత ఇళ్లు కొనుగోలు చేసింది. ఆమె భర్త చనిపోయాడు. కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపింది. ఇక ఆశలన్నీ కొడుకు సుహాస్‌పై పెట్టుకుని జీవనం సాగిస్తోంది ఆ తల్లి.

యువకుడి ప్రైవేటు పార్ట్స్‌పై కొట్టి మరీ చంపేశారు-పసుమాములకు సుహాస్‌ వెళ్లిన తర్వాత రాకేష్, పరశురాం, రాజు, మరొక వ్యక్తితో బాగా పరిచయం ఏర్పడింది. సుహాస్‌కు ఫోన్ లేకపోవడంతో ఓ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాడు. అతని గర్ల్‌ఫ్రెండ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌  చేసినట్టు సమాచారం. ఆమెకి అసభ్యకరంగా సందేశాలు పెట్టడం, ఆమె ఫోన్‌ చేసి రకరకాలుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ యువతి.. తన బాయ్‌ఫ్రెండ్‌కు అసలు విషయం చెప్పింది.

Advertisement

గంజాయ్.. ఆపై అమ్మాయి వ్యవహారం-వారితో గంజాయి వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్నాయట. ఈ నేపథ్యంలో సుహాస్‌ను లేపేయాలని భావించి స్కెచ్ వేశారు అతడి ఫ్రెండ్స్. బుధవారం తెల్లవారుజామున సుహాస్‌ తల్లి నందిని ఫోన్‌ చేశారు అందులోని ఓ ఫ్రెండ్. ఆమె ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా ఇంటికెళ్లారు. వారంతా ఫ్రెండ్స్ కావడంతో తల్లి వెళ్లవద్దని చెప్పినా కొడుకు వినలేదు, వారితో కలిసి బయటికెళ్లాడు సుహాస్‌.

పసుమాముల గ్రామ శివారులో మర్రిచెట్టు వద్దకు తీసుకెళ్లి విచక్షణ రహితంగా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకొని అర కిలోమీటరు పరుగు పెట్టాడు సుహాస్. వెంటపడి మరీ ఆ యువకుడి ప్రైవేటు పార్ట్స్‌పై దాడి చేసి చనిపోయే వరకు కొట్టారు. చివరకు సుహాస్ మృతదేహాన్ని పెద్దఅంబర్‌పేట్‌-పసుమాముల రోడ్డులోని శ్మశానవాటిక సమీపంలో ఉంచి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.

ALSO READ: ఉత్తరాది వానలు.. దక్షిణాదిలో వేడి, తెలంగాణలో మరో ఐదురోజులు ఉక్కపోత

కొడుకు ప్రాణాలు కోల్పోయాడన్న విషయం తెలుసుకుని ఆ తల్లి కన్నీరు మున్నీరు అయ్యింది. సుహాస్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. నిందితుల్లో ఒకర్ని అరెస్ట్ చేసి విచారించగా ఈ విషయాలు బయటపడ్డాయి. మిగతా వారికోసం పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.

Related News

ఫీజు రీయంబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్య అంటే నమ్మాలా?.. బండి సంజయ్ చురకలు

నిరాహార దీక్ష.. అస్వస్థతకు గురైన బీజేపీ చీఫ్ రామచందర్‌రావు, నేతల్లో కలకలం

కొండా సురేఖ ఎపిసోడ్‌తో వేడెక్కిన రాజకీయాలు.. రేవంత్ కేబినెట్ పునర్ వ్యస్థీకరణ, ముగ్గురిపై వేటు?

అల్పపీడనం ప్రభావం.. తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో అయితే..

హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ!

జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు

కొండా సురేఖ అంశంపై సీఎం కీలక నిర్ణయం.. వివాదానికి చెక్?

కేంద్రానికి కాంగ్రెస్ మోకరిల్లింది.. స్మార్ట్ మీటర్ల కుట్రను భగ్నం చేస్తాం.. కవిత హెచ్చరిక

Big Stories

Advertisement
×