E-Paper
Advertisement

Gitam University: గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య.. యాజమాన్యం ఏం చెప్పిందంటే..

Gitam University: గీతం యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య.. యాజమాన్యం ఏం చెప్పిందంటే..
Advertisement

Gitam University: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు గీతం యూనివర్సిటీలో.. రేణుశ్రీ(18) అనే విద్యార్థిని కాలేజీ ఐదంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గీతం యూనివర్సిటలో రేణుశ్రీ బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు కూకట్ పల్లిలో ఉంటున్నారు. ఆమె భవనం పై నుంచి వెక్కివెక్కి ఏడుస్తూ.. భయపడుతూ దూకిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. వీడియో తీసే బదులుగా ఎమర్జెన్సీ అలారంను మోగిస్తే.. ఆమె బ్రతికి ఉండేదేమో కదా అని.. వీడియో తీసిన వారిని తిట్టిపోస్తున్నారు.

రేణుశ్రీ మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం ఇస్నాపూర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అక్కడి నుంచి పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం ఏపీలోని ఏలూరులో ఉన్న స్వగృహానికి విద్యార్థిని మృతదేహాన్ని తీసుకువెళ్ళారు. అటెండెన్స్ లో హాజరు శాతం తక్కువగా ఉండటంతో రేణుశ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు రాయలేదని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. పరీక్షల ఒత్తిడితోనే ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×