BigTV English

KTR: కేటీఆర్‌కు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. ఎందుకంటే..?

KTR: కేటీఆర్‌కు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. ఎందుకంటే..?

KTR: దేశంలోనే మొట్టమొదటిసారి ఫార్ములా ఇ-రేస్ హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ రేస్ ద్వారా హైదరాబాద్ చరిత్ర సృష్టించబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా జట్టు మహీంద్రా రేసింగ్ కూడా ఈ పోటీల్లో పాల్గొననుంది. ప్రపంచమంతా పోటీ పడి వచ్చి.. చివరికి సొంత గడ్డపై పోటీల్లో పాల్గొనడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ఆనంద్ మహీంద్రా అన్నారు.


ఈ రేసుకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఎనిమిదేళ్ల ప్రపంచవ్యాప్త రేసింగ్ తర్వాత చివరికి సొంతగడ్డపై రేసింగ్‌లో పాల్గొంటున్నాం. ఎఫ్ఐఏ ఫార్ములా ఈ మొదటిసారి భారత్‌కు వస్తోంది. కేటీఆర్‌కు, గ్రీన్కోకు ఈ విషయంలో ధన్యవాదాలు’’ అంటూ ఆనంద్ మహాంద్రా ట్వీట్ చేశారు.

హైదరాబాద్‌లోని నెక్లస్ రోడ్డులో ఫిబ్రవరి 11న ఈ పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 11 జట్లు ఈ రేసులో పాల్గొననున్నాయి. ఇప్పటికే ఈ రేసుకు సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ చేరుకున్నాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×