BigTV English

Revanth Reddy: 317 జీవోపై రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

Revanth Reddy: 317 జీవోపై రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

GO 317: జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లో భేటీ అవుతుంది. ఉద్యోగుల అభ్యర్థనలపై సబ్ కమిటీ రేపు చర్చ జరపనుంది. ఇది వరకే స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య లేదా భర్త చేసుకున్న దరఖాస్తులపై ఈ సబ్ కమిటీ సానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నది. మిగిలిన దరఖాస్తులపైనా శాఖల వారీగా నివేదికలు రెడీ చేసింది.


వీటితోపాటు 2008 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలు ఇచ్చే విషయానికి సంబంధించిన విధి విధానాలపైనా ఈ సబ్ కమిటీ చర్చించనుందని తెలిసింది. బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని మార్చి 14వ తేదీ నాటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయానికి అనుగుణంగా విధి విధానాలు ఖరారు చేసే బాధ్యతలను సబ్ కమిటీకే అప్పగించారు. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా నష్టపోయిన అభ్యర్థుల వివరాలను ఇప్పటికే విద్యా శాఖ సేకరించింది.

ఆరు వారాల్లోగా బాధితులకు ఉద్యోగాలిస్తామని ఇది వరకే హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 8వ తేదీన ఉన్నది. ఈ తరుణంలో డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు కల్పించే అవకాశాలపై రేపటి కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉన్నదని తెలుస్తూనే ఉన్నది.


Also Read: నటాషాతో విడాకులు ప్రకటించిన హార్దిక్ పాండ్యా

2016లో రాష్ట్రంలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం విభజించింది. కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, మల్టీ జోనులకు ఉద్యోగుల సర్దుబాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 2021లో 317 జీవోను ఆ ప్రభుత్వం తెచ్చింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లే అవకాశాన్ని ఉద్యోగులకు ఈ జీవో కింద కల్పించింది. కానీ, పోస్టింగ్‌లలో మాత్రం సీనియార్టికీ ప్రాధాన్యత ఇచ్చింది. ఇలా ప్రాధాన్యత ఇస్తే సీనియర్లు తమకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ, వారి కంటే తక్కువ సీనియార్టీ ఉన్న ఉద్యోగులకు అవకాశాలు సన్నగిల్లుతూ వస్తాయి. ఫలితంగా వారు కోరుకున్న చోట పోస్టింగ్ లభించే అవకాశాలు తక్కువ. ఈ కారణంగానే 317 జీవోపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×