Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి తెలంగాణలో పలుజిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం వేళ ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యం వరి పంట చేతికి వచ్చే సమయానికే వర్షాలు పడుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షం..
దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. హైదరాబాద్ మహానగరంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అక్కడక్కడ పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
మరి కాసేటట్లో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. కూకట్ పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజుల రామారం, అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, ఉప్పల్, నాగోల్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో మరి కాసేపట్టలో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, నాగర్ కర్నూల్, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. మూడు, నాలుగు గంటల తర్వాత హైదరాబాద్ లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.
చెట్ల కింద ఉండొద్దు.. అధికారులు కీలక సూచన
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు బయటకు రావొద్దని చెబుతున్నారు. వర్షాల పడే సమయంలో చెట్ట కింద నిలబడొద్దని సూచించారు. చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం వేళ రైతులు పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Balmuri Venkat: కవిత ఆరోపణలపై బల్మూరి వెంకట్ పీఎస్‌లో ఫిర్యాదు.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని..?