BREAKING NEWS : కొన్ని యాక్సిడెంట్స్ చూస్తే దిమ్మతిరిగి పోతుంది. అలా ఎలా గుద్దేశారంటూ అవాక్కయ్యేలా చేస్తుంటాయి. అలాంటిదే మరో ఘటన. ఓ ఇంటి ముందు కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ముగ్గురు వృద్ధులు. అదీఇదీ మాట్లాడుకుంటుండగా.. సడెన్‌గా ఓ కారు వాళ్ల మీదకు దూసుకొచ్చింది. అసలేం జరుగుతోందో అర్థమయ్యేలోగా.. జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఆ ముగ్గురు ముసలివాళ్లు చనిపోయారు. ఒకరు స్పాట్ డెడ్ కాగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలయ్యాయి. ఒకరు ఆసుపత్రిలో మృతిచెందారు. ఇంటిముందు కూర్చొని మాట్లాడుకుంటుంటే.. ఇంత దారుణంగా చనిపోతారని ఎవరైనా ఊహించగలరా? ఆ కారు డ్రైవర్ ఓవర్ స్పీడ్‌కు ఇలా రెండు ప్రాణాలు బలయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం, గంగారం గ్రామంలో జరిగిందీ ప్రమాదం. ప్రధాన రహదారికి పక్కనే ఉండే ఎస్సీ కాలనీలోకి దూసుకొచ్చింది కారు. ఓ ఇంటిముందు వృద్ధురాలు మారుపాక మధునమ్మ, నీలారపు బాలయ్య, మల్లయ్యలు కూర్చొని ఉన్నారు. స్పీడ్‌గా వచ్చిన కారు వారిని గుద్దేసింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మధునమ్మ అక్కడికక్కడే చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బాలయ్య మరణించారు. మల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది.
కాళేశ్వరం ఆలయంలో ముక్కంటి దర్శనం చేసుకొని కారులో హైదరబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారు ఓవర్ స్పీడ్‌తో నడపడం వల్లే.. అదుపు తప్పి ఇళ్ల మీదకు దూసుకొచ్చిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కారును సీజ్ చేశారు. డ్రైవర్ కోసం ఆరా తీస్తున్నారు.