E-Paper
Advertisement

akbaruddin owaisi : ఎస్ఐకు వార్నింగ్.. అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు..

akbaruddin owaisi : ఎస్ఐకు వార్నింగ్.. అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు..
Advertisement

akbaruddin owaisi : ఎంఐఎం లీడర్, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీపై కేసు నమోదైంది. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని దూషించారనే అభియోగాలు ఆయనపై నమోదు చేశారు పోలీసులు. ఇన్ స్పెక్టర్ శివ చంద్ర ను దుర్బాషలాడారని పేర్కొంటూ..సెక్షన్ 353,153(a), 506, 505(2), 125 కింద హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ వివరాలను డీసీపీ రోహిత్ రాజు వెల్లడించారు.

ల‌లితాబాగ్‌లో మంగళవారం రాత్రి అక్బరుద్దీన్ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఆ సమయంలో ప్ర‌చారం ముగించాల‌ని ఎస్ఐ శివచంద్ర కోరారు. దీంతో సదరు పోలీసు అధికారిపై అక్బ‌రుద్దీన్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇంకా సమయం ఉందని స్పష్టం చేశారు. తాను మాట్లాడి తీరతానని తేల్చిచెప్పారు.

Advertisement

అంతేకాదు తనను ఆపేవాళ్లు ఇంకా పుట్టలేదంటూ అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. తన ఒంట్లో బుల్లెట్లు దిగినా.. కత్తిగాయాలైనా సరా ఇంకా ధైర్యమే ఉందన్నారు. తాను ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్నవారు పరిగెత్తిస్తారంటూ ఎస్ఐకు అక్బరుద్దీన్‌ వార్నింగ్ ఇచ్చారు.

అక్బరుద్దీన్ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అక్బరుద్దీన్ తీరుపై బీజేపీ మండిపడింది. ఎంఐఎం నేర సంస్థగా మారిందని ఆరోపించింది. ఓల్డ్ సిటీని నిర్వీర్యం చేసిందని విమర్శించింది. బీజేపీ ప్రభుత్వంలో అక్బరుద్దీన్ చర్యకు బుల్డోజర్ తో ప్రతిచర్య ఉంటుందని బీజేపీ తెలంగాణ విభాగం వార్నింగ్ ఇస్తూ ట్వీట్ చేసింది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×