Intinti Ramayanam Today Episode December 17th : నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ కు ఆరాధ్య రంగులు పూస్తుంది. నీ పని చెప్తానని ఆరాధ్య కమల్ ని జోకర్ లాగా రెడీ చేస్తుంది. భానుమతి అక్కడికొచ్చి రిమోట్ కోసం వెతుకుతూ కమల్ ను లేపుతుంది. కమల్ అవతారం చూసి ఒక్కసారిగా కేకలు పెడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. కమల్ అవతారం చూసి అందరూ నవ్వుకుంటారు. ఇక ఇది ఆరాధ్య పని అని తెలుసుకున్న కమల్ ఆరాధ్యను నువ్వు పట్టుకోవాలని చూస్తాడు. అప్పుడే అక్ష ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే భానుమతి తన భార్య చేసిన పనిని చెప్తుంది. మీ నాన్న సంపాదించి పెడుతుంటే నీ భార్య దానాలు చేస్తుంది అనేసి భానుమతి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. అక్షయ్ వెళ్లి అవనిని అడుగుతాడు.. ఒక మాట చెప్పి చేసుంటే ఇదంతా వచ్చేది కాదు కదా ఇప్పుడు నువ్వే తప్పు చేశావని అందరూ అంటున్నారు అనేసి అవనితో అనగానే అవని నేను మీకు చెప్పాలని వచ్చాను మీరు బిజీగా ఉన్నారు నేను చెప్పాలనుకున్న కానీ మీరు విని పరిస్థితిలో లేరు అవసరం అంటేనే ఇచ్చాను కావాలని నేను ఏదీ చేయలేదండి అనేసి అంటుంది. ఇకమీదట నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నేను బిజీగా ఉంటే అమ్మతోనో నాన్నతో నువ్వు చెప్పు అనేసి అంటాడు. ఇక అక్షయ్ ఇచ్చిన ఆస్తి పత్రాలను పార్వతీ రాజేంద్రప్రసాద్కిస్తుంది. పిల్లల పేరు మీద ఆస్తులు రాసి పెట్టాను అని చెప్పేసి పార్వతితో అంటాడు. అక్షయ్ కు సగం ఆస్తి రాస్తాడు. అది చూసిన పార్వతి ఏడుస్తుంది. మన బిడ్డ కాకపోయినా అంత ఆస్తి ఇచ్చానని బాధపడుతున్నావా అనేసి అడుగుతాడు. అక్షయ్ ఎప్పుడు నా బిడ్డగానే చూసాను నా బిడ్డ కాదని నేను ఎప్పుడూ అనుకోలేదు అనేసి ఎమోషనల్ అవుతుంది. మీరు చెప్పేంతవరకు అక్షయ్ నా కొడుకు కాదని నాకు తెలియదండి. ఊహ తెలియక ముందే వాళ్ళ అమ్మ చనిపోతే ఆ స్థానాన్ని నేను తీసుకొని నా కొడుకు కన్నా ఎక్కువగా వాడిని పెంచాను. ఇలా మీరు ఆస్తిని పంచి వారిని వేరు చేశారు అనేసి పార్వతి బాధపడుతుంది.. ఇక రాజేంద్రప్రసాద్ నువ్వు వాడిని సవతి కొడుకు లాగా పెంచావని నేను ఎప్పుడు అనలేదు. మరి ఇదేంటండి సగం ఆస్తిని వాడికి రాసిచ్చారు అంటే అంతే కదా వాడికి నేను తల్లిని కాదు అనేసి మీరు వేరు చేస్తున్నారు కదా అంటుంది. నా కొడుకులని తనని వేరు చేసి చూస్తున్నారు కదా అనేసి రాజేంద్రప్రసాద్ తో అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ ఇవ్వడంతో పార్వతీ బాధపడుతుంది. నేనెప్పుడూ వాడ్ని కొడుకు కాదని అనుకోలేదు మీరు ఆస్తిని వేరుచేసి వాడు నా కొడుకు కాదని గుర్తు చేస్తున్నారని పార్వతి బాధపడుతుంది. రాజేంద్రప్రసాద్ మాత్రం చెప్పిన పార్వతీ వినిపించుకోదు. రాజేంద్రప్రసాద్ తో పార్వతీ గొడవ పడుతుంది. అప్పుడే అవని వచ్చి భోజనం రెడీ అయింది మిమ్మల్ని పిలవడానికి వచ్చానండి అని అంటుంది మేము వస్తాం నువ్వు వెళ్ళు అవని అనేసి పార్వతి అంటుంది.. ఇక కమల్ ఆకలేస్తుందని బయట అరుస్తూ ఉంటాడు. అవని వదినని బాధ పెడుతున్నావ్ కదా ముసలి నీకు ఎలాగైనా ఈరోజు బుద్ధి చెప్పాలి అనేసి కమల్ భానుమతి కూర్చునే చైర్ లో పిన్ను పెడతాడు. ఇక అందరూ భోజనానికి వస్తారు. భానుమతి కూర్చోగానే పిన్ను గుచ్చుకుంటుంది. కెవ్వుమని అరుస్తుంది. అందరూ ఏమైందని అడుగుతారు. పిన్ను గుచ్చుకునిందని భానుమతి అంటుంది. వదిన గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడాలంటే ఈసారి పాములు తెల్లు నువ్వు కూర్చుని కుర్చీలో ఉంటాయని కమల్ భానుమతితో అంటాడు. అందరూ కలిసి భోజనం చేస్తుంటే పార్వతి మాత్రం భోజనం చేయకుండా కూర్చుంటుంది.. అక్కడినుంచి వెళ్ళిపోతుంది వెంటనే అక్షయ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భానుమతి నువ్వు గాజులు ఇవ్వడం వల్లే పార్వతి అలా బాధ పడుతుందనేసి అంటుంది. రాజేంద్రప్రసాద్ లోపలికి భోజనం తీసుకుని వెళ్తాడు. ఇది నిజం బయటపడకుండా ఉండాలంటే తో మంచిగా ఉండాలి లేదంటే మాత్రం అక్షయ్ నీ కొడుకు కాదని నా మొదటి భార్య కొడుకు అని అందరికీ తెలిసిపోతుంది తర్వాత వాళ్లలో వాళ్లకే భేదాభిప్రాయాలు వస్తాయి ఇది నువ్వు అర్థం చేసుకోవాలి పార్వతి అనేసి అంటాడు.
భోజనం చేయలేదని అక్షయ్ కూడా భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. నువ్వంటే అంత ఇష్టం అనేసి పార్వతితో అంటాడు. ఇక అవని అక్షయ దగ్గరికి ఫ్రూట్స్ తీసుకుని వెళుతుంది.
మా అమ్మ భోజనం చేయకుండా వెళ్ళింది అంటే అది నీ వల్లే నువ్వు వేరే వాళ్ళకి దానం చేయడం వల్ల ఆమెను అందరు తిట్టారు దాంతో ఆమె మనసు బాధ పడింది అందుకే భోజనం చేయలేదు. మా అమ్మ మమ్మల్ని ఎలా పెంచిందో నీకు తెలుసా.. మా నాన్న బాధ్యతలు అంటూ చెప్పి ఊర్లు తిరుగుతుంటే మా అమ్మ మాత్రం మమ్మల్ని ఆ లోటు తెలియకుండా పెంచింది. ప్రేమతో పాటు తండ్రి బాధ్యతలను కూడా తానే తీసుకొని మమ్మల్ని ఇంత పెద్ద వాళ్ళని చేసింది కానీ నా వల్ల నా భార్య వల్ల మా అమ్మ బాధ పడకూడదని అనుకున్నాను. కానీ నీవల్ల ఈరోజు మా అమ్మ బాధపడింది నాకెలా ఉంటుంది మామ బాధపడుతుంటే కడుపునిండా భోజనం చేయమని చెప్తావా అనేసి అక్షయ్ అవని పై సీరియస్ అవుతాడు. అత్తయ్య గారు ఇంత బాధ పడతారని నేను అనుకోలేదండి అనేసి అనగానే నువ్వు ఏది అనుకోవు కానీ అందని బాధ పెడతావు అనేసి అక్షయ్ బయటికి వెళ్లిపోతాడు. అక్షయ్ ని చూసి బాధపడుతుంది. ఇక పైన సోఫాలో కూర్చుని బాధపడుతూ ఉంటే భానుమతి పార్వతి దగ్గరికి వెళుతుంది. నా కొడుకు కాక ని నేను ఎప్పుడు అనుకోలేదు అత్తయ్య ఈరోజు ఆయన తన మొదటి భార్య కొడుకుని నాకు గుర్తు చేశారు అనేసి బాధపడుతుంది. ఆస్తిలో సగం వాటాని అక్షయ పేరు మీద రాశారు అనగానే భానుమతి షాక్ అవుతుంది. రాజేంద్రప్రసాద్ సగం ఆస్తి అక్షయ్ కి రాసాడా అనేసి అడుగుతుంది. ఇక అక్కడికి వచ్చిన రాజేంద్రప్రసాద్ పార్వతి ఇక్కడ ఉన్నావా? పద లోపలికి అనేసి అడుగుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..