BigTV English

Bigg Boss 8 Telugu: నబీల్ చెంపపై సీత ముద్దు.. మణికంఠకు బిగ్ బాస్ అన్యాయం, చివరికి ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందిగా!

Bigg Boss 8 Telugu: నబీల్ చెంపపై సీత ముద్దు.. మణికంఠకు బిగ్ బాస్ అన్యాయం, చివరికి ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందిగా!

Bigg Boss 8 Telugu Latest Updates: ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ అంతా దాదాపుగా యష్మీ చేతిలోకి వెళ్లిపోయింది. సౌకర్యాలు అన్నీ తనకు, తన టీమ్‌కే దక్కుతున్నాయి. అరిచి మరీ వారి మాట గెలిచేలా చేసుకుంటున్నారు. దీంతో మిగిలిన రెండు టీమ్స్ ఒంటరి పోరాటం చేస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా నిఖిల్ టీమ్‌లో స్థానం దక్కించుకున్నందుకు నాగ మణికంఠకు దారుణంగా అన్యాయం జరుగుతుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. తన టీమ్‌లో నిఖిల్, మణికంఠ మాత్రమే ఉన్నా వారు కూడా ప్రతీ టాస్కులో తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో నైనికా టీమ్‌కు చెందిన నబీల్ కూడా ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది.


పాపం ఆకలి

బిగ్ బాస్ హౌజ్‌లో రేషన్‌ను కూడా హౌజ్‌మేట్స్ టాస్కులు ఆడి గెలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిఖిల్ టీమ్‌లో నాగ మణికంఠ మాత్రమే ఉన్నాడు. అయినా వారిద్దరూ కలిసి రేషన్ కోసం చాలానే కష్టపడి టాస్కులు ఆడారు. చివరికి ఓడిపోయారు. దీంతో వారమంతా రాగి జావా, పచ్చి కూరగాయలు మాత్రమే తిని బ్రతకాలని బిగ్ బాస్ ఆదేశించారు. కానీ ఇతర టీమ్స్ కడుపునిండా భోజనం చేయడం, జ్యూస్‌లు తాగడం చూసి మణికంఠ ఫీలయ్యాడు. అంతే కాకుండా ఇద్దరే టాస్కులు ఆడాల్సి రావడంతో మణికంఠ, నిఖిల్ బాగా అలసిపోయారు కూడా. దీంతో తిండి కోసం మణికంఠ బిగ్ బాస్ ఆదేశాలను పక్కన పెట్టక తప్పలేదు.


Also Read: నీఛమైన మాటలు, చిన్నపిల్లల చేష్టలు.. ఇదెక్కడి ‘దండుపాళ్యం’ బ్యాచ్‌రా బాబు!

తిండి తినొద్దు

రాత్రి అందరూ పడుకున్న తర్వాత మణికంఠ వెళ్లి దోశలు వేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడ కొందరు హౌజ్‌మేట్స్ ఉన్నా కూడా తనను చూసి జాలిపడి ఎవరూ ఏమీ అనలేదు. సైలెంట్‌గా చీకట్లోకి వెళ్లి దోశలు తింటున్న సమయంలో అక్కడికి నిఖిల్ వచ్చాడు. అలా ఇద్దరు కలిసి దోశలు తిని కడుపునింపుకున్నారు. వాళ్లు అలా చేయడంతో బిగ్ బాస్‌కు కోపమొచ్చింది. అర్థరాత్రి 2 గంటలకు కంటెస్టెంట్స్ అందరినీ లేపి మణికంఠ, నిఖిల్ అలా చేయడం తప్పు అని, వాళ్లు అలా చేస్తున్నప్పుడు చూస్తూ సైలెంట్‌గా ఉన్న హౌజ్‌మేట్స్ కూడా తప్పు చేసినట్టే అని వారిపై కోప్పడ్డారు. ఈసారికి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని, మరోసారి ఇలాంటి తప్పు చేయకూడదని ఆదేశించారు.

బాబోయ్ నొప్పి

ప్రైజ్ మనీ కోసం టాస్కులు మొదలవ్వగా అందులో యష్మీ టీమ్ మరీ విచక్షణ లేకుండా ఆడుతుంది. ఆట విషయానికి వచ్చేసరికి పృథ్వి పిచ్చివాడిలాగా ఆడుతున్నాడని నిఖిల్.. నైనికాతో అన్నాడు. నిఖిల్ టీమ్‌లో ఇద్దరే ఉన్నా వారిద్దరూ వీలైనంత కష్టపడి టాస్కులు గెలవడానికి ప్రయత్నాలు చేశారు. ప్రైజ్ మనీలో రూ.50 వేలు దక్కాలంటే పృథ్విరాజ్, నిఖిల్, నబీల్ కాళ్లపై, ఛాతిపై వ్యాక్సింగ్ చేసుకోవాలని బిగ్ బాస్ తెలిపారు. వెంట్రుకలు తీస్తున్నప్పుడు ఆ నొప్పి తట్టుకోలేక పృథ్వి తప్పుకున్నాడు. ఎంత నొప్పి వచ్చినా తట్టుకొని నబీల్ టాస్క్ విన్ అయ్యాడు. వ్యాక్సింగ్ వల్ల తన ఛాతి అంతా ఎర్రగా అయిపోయింది. దీంతో టాస్క్‌లో తను పడిన కష్టం చూసి సీత ఇంప్రెస్ అయ్యి తనకు బుగ్గ మీద ముద్దు కూడా పెట్టింది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×