E-Paper
Advertisement

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి పై కేసు నమోదు..!

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి పై కేసు నమోదు..!
Advertisement

Hostel Dispute: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి పై కేసు నమోదైంది. పంజాగుట్ట హాస్టల్ వివాదంలో బొంతు శ్రీదేవితో పాటు ఆమె తల్లి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసారు. మరోవైపు బొంతు శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హాస్టల్ నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు.

కేసు నమోదు..

హైదరాబాద్ పంజాగుట్ట లోని ఏషియన్ పీజీ హాస్టల్లో జరిగిన వివాదంలో ఇరుపక్షాలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి పై ఆమె తల్లి బయమ్మ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బొంతు శ్రీదేవి 30 మందితో హాస్టల్ పై నిర్వాహకులపై దాడి చేసినట్లు ఫిర్యాదులో నిర్వాహకులు పేర్కొన్నారు. బొంతు శ్రీదేవి రాజకీయ పలుకుబడితో బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

Advertisement

Also Read: రేపు మేడ్చల్‌లో ‘ప్రజాపాలన ప్రగతి’ జాతర: కలెక్టర్ మను చౌదరి

ప్రాణహాని ఉందని..

హాస్టల్ భవన యజమానులు బొంతు శ్రీదేవిల నుండి తమకు ప్రాణహాని ఉందని హాస్టల్ నిర్వాహకుడు వీర హనుమాన్ రెడ్డి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బొంతు శ్రీదేవి ఆమె తల్లిపై 115(2), 126(2), 127(2), 351(2), 324(4), r/w 3(5) BNS సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ వివాదానికి సంబంధించి బొంతు శ్రీదేవి సైతం హాస్టల్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరి ఫిర్యాదు మేరకు నిర్వాహకులు రాజ్యలక్ష్మి.. అపర్ణాలపై సైతం పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: ధాన్యం సేక‌ర‌ణ‌లో.. జిల్లా క‌లెక్ట‌ర్లు విఫ‌లం! క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల్లేవు.. ప‌రిశీల‌నా లేదు..!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×