Telangana survey: తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే చివరి అంకానికి చేరింది. సర్వేకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నవంబరు 30(ఇవాళ్టి)తో ముగియనుంది. శనివారంతో సర్వే ముగిస్తారా? లేక పొడిగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
మిగతా జిల్లాలతో పోలిస్తే జీహెచ్‌ఎంసీలో సర్వే అనుకున్నంత వేగంగా జరగడం లేదు. శుక్రవారం సాయంత్రం నాటికి 82.4 శాతం సర్వే పూర్తయ్యింది. ఇంకా 4, 41, 225 ఇళ్లలో సమాచారం సేకరించాల్సి ఉంది. మొత్తం 19 జిల్లాల్లో 100 శాతం సర్వే పూర్తయ్యింది.
ప్రభుత్వం ఇచ్చిన గడువు శనివారంతో ముగియనుంది. ఈ క్రమంలో మరోవారం పొడిగిస్తారా? ఇవాళ్టితో ఫినిష్ చేస్తారా? అనేది చూడాలి. ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని కంప్యూటరీకరణ చేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు అధికారులు.
శుక్రవారం నాటిని తెలంగాణ వ్యాప్తంగా 49 లక్షల 79 వేల 473 ఇళ్లకు సంబంధించి కంప్యూటరీకరణ పూర్తి అయ్యింది. ములుగు జిల్లాకు సంబంధించి అత్యధికంగా 92 శాతం సమాచారం కంప్యూటరీకరణ అయ్యింది.. తొలి స్థానంలో నిలిచింది.
ALSO READ: రూట్ మార్చిన కేటీఆర్, హరీష్.. అధికారులకు బెదిరింపులు.. కుయుక్తులకు స్కెచ్?
తర్వాత ప్లేస్‌లో యాదాద్రి జిల్లా, సిద్ధిపేట్, మహబూబ్‌నగర్ జిల్లాలు వున్నాయి. రెండు జిల్లాల్లో 70శాతం, నాలుగు జిల్లాల్లో 60శాతం, 11 జిల్లాల్లో 50శాతానికి పైగా కంప్యూటరీకరణ పూర్తి అయ్యింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళతో పూర్తి చేయాలన్నది అధికారుల ఆలోచన.