trinayani serial today Episode: సరిగ్గా మూడు గంటలకు ఏం జరిగిందో గుర్తు చేసుకుని.. ఈ మూడు గంటల్లో ఏం చేశావో నీకు గుర్తు రాకపోయినా తర్వాత ఏం చేయాలో గుర్తు పెట్టుకో.. ఆ తర్వాత ఇలా వీళ్లందరి చేత నువ్వు మాటలు పడాల్సిన అవసరం ఉండదు అని గురువుగారు చెప్పి వెళ్లిపోతారు. చెల్లి అన్నింటికన్నా ముందు గురువు గారు చెప్పింది గుర్తు పెట్టుకో అంటుంది హాసిని. అలాగే అక్కా అంటూ నయని లోపలికి వెళ్తుంది.
గుర్తు పెట్టుకోవాలని వల్లభ టెన్షనతో అటూ ఇటూ తిరుగుతుంటాడు. తిలొత్తమ్మ వచ్చి నీకేం అయిందిరా అలా తిరుగుతున్నావు అని అడుగుతుంది. గురువు గారు చెప్పారు కదా మమ్మీ గుర్తు పెట్టుకోవాలని అంటాడు వల్లభ. నువ్వేం గుర్తు పెట్టుకోవాలో నీకు తెలుసా.. అని తిలొత్తమ్మ అడగ్గానే తెలియదని చెప్తాడు వల్లభ. రేయ్ గుర్తు పెట్టుకోమని నయనికి చెప్పాడు నీకు కాదు అంటుంది తిలొత్తమ్మ. నీకు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు అంటుంది. ఎందుకు లేదు నాకు కొంచెం ఉంది. అంటూ వల్లభ పిచ్చిపిచ్చిగా ఏదేదో మాట్లాడతాడు. దీంతో తిలొత్తమ్మ వల్లభను కోపంగా చూస్తూనే వల్లభను మెచ్చుకుంటుంది. తర్వాత గురువు గారికి ఏదో రహస్యం తెలిసే ఉంటుంది. కానీ చెప్పడు అంటుంది.
విక్రాంత్ ఏదో పని చేసుకుంటుంటే.. సుమన వచ్చి నాలుగు రోజులు రెస్ట్ దొరికింది అనుకునేలోపు మళ్లీ మొదలు పెట్టారా..? అని అడుగుతుంది. పనేం చేయకుండా ఎవరు ఏం చేస్తారా..? అని తొంగి చూడ్డం చేయలేం కదా.. సుమన అంటాడు. దురందర పిన్ని లండన్ కు వెళ్లి కావాలనే ఐదో నెలప్పుడే వచ్చింది చూశారా..? ఎందుకంటారు అని అడుగుతుంది సుమన. ఎందుకు అని విక్రాంత్ అడగ్గానే సీమంతం ఖర్చంతా మన నెత్తి మీద వేద్దామని. అందుకే వచ్చినప్పటి నుంచి నా సీమంతం ఎప్పుడు.. భోజనాల ఖర్చెంత అంటూ చెవులు కొరుక్కుతింటుంది అని సుమన చెప్పగానే పోనీలే ఇన్ని రోజులకు మామయ్య, అత్తయ్యా తల్లిదండ్రులు కాబోతున్నామనే సంతోషంలో ఉన్నారు కదా.. అంటాడు విక్రాంత్.
తెల్లారితే నయని అమ్మా ఎలా మారుతుందోనని టెన్షన్‌గా ఉందమ్మా అటాడు పావణమూర్తి. ఇంతలో విశాలాక్షి వస్తుంది. హాసిని హ్యపీగా పిలుస్తుంది. ఏంటి పెద్దమ్మ నాకోసమే ఎదురుచూస్తున్నట్టు ఉన్నారు అని అడుగుతుంది. ఇంతలో విశాల్ వచ్చి విశాలాక్షి ఎప్పుడొచ్చావమ్మా అని అడుగుతాడు. నేను రావడం ఏంటి నాన్నా.. ఎప్పుడూ మీతోనే ఉంటాను కదా..? అంటుంది. దీంతో వల్లభ వెటకారంగా నవ్వుతాడు. నా పేరు తలుచుకుంటే ఎప్పుడూ మీ మనసులోనే ఉంటాను కదా..? అంటున్నాను అంటుంది విశాలాక్షి. ఇంతలో నేత్రి వస్తుంది. అందరూ అటువైపే చూస్తుంటారు. నయనమ్మ వస్తుందని పావణమూర్తి అంటాడు. లంగావోణి కట్టిందంటే నయని కాదు మామయ్యా అంటాడు వల్లభ.
దీంతో విశాలాక్షి అవును అంటుంది. నీకు తెలుసా..? అని తిలొత్తమ్మ అడగ్గానే అర్థమవుతుంది నిదానంగా అంటుంది విశాలాక్షి. ఇంతలో నయని దగ్గరకు రాగానే విశాల్, నయని ఎవరు వచ్చారో చూడు అంటాడు. విశాలాక్షిని చూసిన నేత్రి.. అమ్మా మహంకాళీ అంటూ మొక్కుతుంది. అందరూ షాకింగ్ గా చూస్తారు. పావణమూర్తి మహంకాళీయా..? అంటాడు. అవును బాబాయ్ మనం ఎంత పుణ్యం చేసుకుని ఉంటే మహంకాళీ దర్శన భాగ్యం కలుగుతుందో తెలుసా.? అంటుంది. దీంతో విశాల్.. నయని నువ్వు విశాలాక్షిని మమంకాళీ అంటున్నావేంటి అని అడుగుతాడు. దీంతో అమ్మవారికి ఎన్నో పేర్లు కదా బాబుగారు అంటుంది నేత్రి. అలా అంటున్నా కూడా ఎలా నవ్వుతుందో చూడు గారడీ పిల్ల అంటాడు వల్లభ. నన్ను ఆ పేరుతో పిలిచినందుకు సంతోషంగా ఉంది అంటుంది విశాలాక్షి.
దీంతో ఎందుకుండరు మాకు పిచ్చి పట్టించేందుకే ఉన్నారు కదా ఇద్దరు అంటుంది తిలొత్తమ్మ. ఏంటమ్మా మేమే మీ దగ్గరకు పూల సంచి పట్టుకుని వచ్చి మొక్కు చెల్లించుకోవాలి కానీ మీరే మా దగ్గరకు వచ్చారు అంటుంది నేత్రి. మాకైతే ఏమీ అర్థం కావడం లేదని అంటుంది సుమన. ముందు ప్రసాదం తీసుకోండి అంటుంది విశాలాక్షి. సంతోషంగా నేత్రి మా కోసం ప్రసాదం తీసుకొచ్చావా.. అమ్మ ఇవ్వు అందరికీ పంచుతాము అంటుంది నేత్రి. తిలొత్తమ్మ మాకేం వద్దని ఏం తిని విశాలాక్షి అలా మాట్లాడుతుదో.. ఆ ప్రసాదం కూడా తిన్నామంటే మా మతులు కూడా పోయేలా ఉన్నాయి అంటుంది. దీంతో నేత్రి విశాల్, హాసిని, సుమన, పావణమూర్తిలకు ఇస్తుంది.
ఇంతలో విక్రాంత్ ప్రసాదం నేను తర్వాత తింటాను కానీ మీరు మాట్లాడుకున్నదాన్ని బట్టి చూస్తే దేవీపురం అడవిలో ఉన్న గుడి దగ్గర ఏదో జరిగింది అనిపిస్తుంది అంటాడు. దీంతో విశాలాక్షి అవును చిన్నాన్న నువ్వు తెలివిగలవాడివే కాబట్టి పసిగట్టేశావు అంటుంది. నయని దేవీపురం రాగానే నాకు ఫోన్ చేసింది. తర్వాత యాక్సిడెంట్ అయింది అని విశాల్ చెప్పగానే.. యాక్సిడెంట్ అయింది నయని అమ్మకు ఈ అమ్మకు కాదు అంటుంది విశాలాక్షి. దీంతో అందరూ షాక్ అవుతారు. అమ్మ పేరు త్రినయని.. ఈ అమ్మ పేరు త్రినేత్రి అంటుంది. ఇదంతా నీకెలా తెలుసు అని విశాల్ అడగ్గానే అయ్యో నాన్న నాకు తెలియనిదేముంటుంది అంటుంది విశాలాక్షి.
ఇంతలో విక్రాంత్ కోపంగా నాటకాలు ఆడుతున్నారు అంటాడు. దీంతో విశాల్ కోపంగా విక్రాంత్ తొందరపడి మాట జారొద్దు.. నయనిని అన్నా పర్వాలేదు. కానీ చిన్నపిల్ల విశాలాక్షిని అంటే నేను ఊరుకోను అంటాడు. దీంతో విశాలాక్షి నాటకం ఆడుతుంది నేను కాదు.. నేత్రి కాదు.. మీ తమ్ముడు విక్రాంత్ ఆడుతున్నాడు అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?