Satyabhama Today Episode November 30 th : నిన్నటి ఎపిసోడ్ లో.. గంగతో మాట్లాడడానికి సత్య గంగ దగ్గరికి వెళుతుంది. బ్యాగ్ సర్దుకుంటున్న గంగను చూసి ఎక్కడికి వెళ్తున్నావ్ అని సత్య అడగ్గానే నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను అని గంగా షాక్ ఇస్తుంది. ఇంత జరిగిన తర్వాత నువ్వు వెళ్ళిపోతాను అంటే మామయ్యది గెలుపని ఆయన వీర్ర వీగుతాడు. ఆయనది తప్పేం లేదని సంబరపడిపోతాడు ఇవన్నీ నువ్వు చెయ్యొద్దు అనేసి గంగను బతిమలాడుతుంది సత్య. మా మామయ్యకి ఈ విషయం తెలియాలని నేనే చెప్పాను నీకు ఏం కాదు ఆయన చుట్టూ ఉచ్చు బిగించుకునింది ఇప్పుడు ఆయనకే ప్రాబ్లం రాజకీయంగా ఆయన ఎదగాలంటే నువ్వు చెప్పినట్టు చచ్చినట్టు చేయాల్సిందే అనేసి చెప్తుంది మొత్తానికి గంగను సత్య ఒప్పిస్తుంది. భైరవి క్రిష్ దగ్గరికి వెళ్లి అరె చిన్న నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ గంగని బయటికి పంపించాలి అనేసి అడుగుతుంది.. భైరవి అప్పుడే మహదేవయ్య దగ్గరకు వచ్చి మాట్లాడాలని అడుగుతుంది. ఆ గంగకు ఎంతో కొంత పడేసి దాన్ని పంపించేయండి అనేసి అనగానే సత్య జయమ్మ ఇద్దరు భైరవికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. వీరందరి మాటలు విన్న గంగ అప్పుడే ఎంట్రీ ఇస్తుంది. ఏం కావాలో చెప్పు అని భైరవి అడగ్గానే సగం ఆస్తి కావాలి అనేసి అందరికీ షాక్ ఇస్తుంది గంగ. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. గంగను ఇంట్లో నుంచి పంపించాలని ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.భైరవి ఆ గంగాకి ఎంతో కొంత ఇచ్చేసి పంపించేయ్ నాకు టెన్షన్ అవుతుంది అనేసి మహాదేవయ్యను అడుగుతుంది. ఆస్తిస్తే పోతుందా అనేసి సత్య అడుగుతుంది. ఇదంతా కాదు టెస్ట్ చేయిస్తే సరిపోతుంది అని సత్య అందరిని నమ్మిస్తుంది. ఇక అప్పుడే గంగా ఎంట్రీ ఇస్తుంది. చిన్న నేను పోను అంటూ డైలాగ్ తో అందరికీ షాక్ ఇస్తుంది. ఆయనకి నేను రెండో భార్యని అంటే నాకు కూడా ఇంట్లో హక్కుంది అక్కకి ఎంత హక్కుందో నాకు అంతే అక్కుంది అనేసి నాకు ఇంట్లో సగం పాట కావాలి అని అడుగుతుంది గంగ. లేదంటే డిఎన్ఎ టెస్ట్ చేయించుకుని అసలు నిజమేంటో బయటపడాలి అనేసి డిమాండ్ చేస్తుంది. ఇంకొక ప్లాన్ ఉంది అనగానే సత్య ఏంటి అని అడుగుతుంది. నువ్వు క్రిష్ నాతోటి వచ్చేసేయండి మన ఇంట్లో ఉందామనేసి అడుగుతుంది. దానికి క్రిష్ సచ్చినా నేను పోను అని అంటాడు. మరి రేపు డిఎన్ఎ టెస్ట్ చేయించుకోవడానికి నేను రెడీ ఆ టెస్ట్ లో నేను కాదని తెలిస్తే ప్రాణత్యాగం కూడా చేస్తానని గంగా సవాల్ చేసి వెళ్తుంది. ఇక భైరవి జయమ్మ టెన్షన్ పడుతుంటారు. మహదేవయ్య దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు.
ఇక సంధ్య బయటకు వెళ్తే ఆ సంజయ్ ని కలవాల్సి వస్తుంది అసలు విధి అంటే ఏంటి అని నానమ్మని అడుగుతుంది. ఇది అంటే దైవ నిర్ణయమని ఎవరిని ఎప్పుడు కలపాలో అప్పుడే కలుపుతుందని అంటుంది. హర్ష అక్కడికి వస్తాడు. విశ్వనాథ్ టాబ్లెట్స్ అయిపోయినయ్యాయని తీసుకురమ్మని హర్షాకు చెప్తాడు. హర్ష నేను ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను నాన్న అని, సంధ్యను మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్తాడు. కలవాల్సి వస్తుంది నేను అస్సలు వెళ్ళను అనేసి మనసులో అనుకుంటుంది. నేను ఫోను అసలు నాన్న చెప్పింది నీకే కదా నువ్వే పోయి తీసుకురా అనేసి అంటుంది. ఇక విశ్వనాధ్ మీరెవరు వెళ్లదు నేనే వెళ్లి తెచ్చుకుంటాను అని అంటాడు. అప్పుడే సంధ్యా నేను వెళ్లి తీసుకొస్తాను అనేసి అంటుంది. ఇక హర్షను మైత్రిని కలవకూడదని నమ్మించాలని ట్రై చేస్తున్నావా అనేసి అడుగుతుంది నందిని.. ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు నేనేంటో నాకు తెలుసు అని హర్ష డైలాగులు వదులుతాడు. నాకు నమ్మకం ఉంది పెనిమిటి అనేసి నందిని అంటుంది. నిజంగానా అనగానే బెడ్ రూమ్ లోకి రా చెప్తాను అనేసి లోపలికి వెళ్ళిపోతారు ఇద్దరు.
మహదేవయ్య ఇంటికి డాక్టర్స్ వస్తారు. అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు. డాక్టర్స్ ఏంటి మీరు డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధంగా లేరా అనేసి అడుగుతారు. మీరు మనసు మార్చుకున్నారా అయితే చెప్పండి అనేసి అడుగుతారు. మహదేవయ్య నన్ను కాదు అడగాల్సింది ఆ విషయం ఆవిడని అడగండి అనేసి అంటారు. దూరం వచ్చిన తర్వాత తగ్గేదే లేదు అనేసి గంగ అంటుంది. ఇక సత్యా మరో డ్రామా ని మొదలు పెడుతుంది. పరువు తీసిన చాలు ఇక్కడతో ఆపేద్దామనేసి అంటుంది. మహదేవయ్యకు చెమటలు పట్టిస్తుంది. దానికి గంగా మోసం చేసేది నేను కాదు మీ మామయ్యే అనేసి అంటుంది. ఆఖరి అవకాశము ఇవ్వాల్సింది నాకు కాదు మీ మామయ్యకే అని గంగా డిఎన్ఎ టెస్ట్ కి రెడీ అని చెప్తుంది. టెస్ట్ కి శాంపిల్స్ ఇస్తారు కానీ మహదేవయ్యా ఆలోచిస్తూ ఉంటాడు సత్య మహదేవయ్యకు ఇదే లాస్ట్ అవకాశం మీరు కన్న తండ్రి కాదని ఒప్పేసుకోండి లేదంటే మాత్రం అడ్డంగా ఇరుక్కుంటారు అనేసి అంటుంది. సత్య మార్చుకుంటున్నారా అని అడుగుతుంది దానికి గంగా నేను అస్సలు ఒప్పుకోను అనగానే భైరవి కూడా నేను ఒప్పుకోను శాంపిల్ ఇవ్వాల్సిందే అనేసి అంటారు. భైరవి నా పెనిమిటి అలాంటోడు కాదు నా పెనిమిటి వెనక్కి తగ్గడు శాంపిల్స్ తీసుకో అనేసి డాక్టర్ కి చెప్తుంది. అసలు వ్యవహారం ఏంటో ఇప్పటి తో బయటపడుతుందనేసి సత్య అంటుంది. ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…