Missile from Rail: దేశీయ రక్షణ రంగం అరుదైన మైలురాయిని అధిగమించింది. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతంగా సక్సెస్ అయ్యింది. ఇందులో ప్రత్యేక అంటూ ఏమీ లేదు. కాకపోతే ‘శత్రువుల గుండెల్లో రైళ్లు’ పరిగెత్తడం ఖాయం. ఎందుకంటే దేశంలో మొట్టమొదటిసారిగా రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి ‘అగ్ని-ప్రైమ్ క్షిపణిని’విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.
నార్మల్‌గా క్షిపణి ప్రయోగాలు భూమి నుంచి ప్రయోగిస్తారు. లేకుంటే సముద్రం నుంచి ప్రయోగిస్తారు. ఇప్పుడైతే ఆకాశం నుంచి ప్రయోగిస్తున్నారు. దేశంలో తొలిసారి రైలు ఆధారిత మొబైల్ లాంఛర్ వ్యవస్థ నుంచి క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది భారత ప్రభుత్వం. ఈ విషయాన్ని స్వయంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా వెల్లడించారు.
సరిహద్దు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నవేళ సరిహద్దుల్లో రైలు నుంచి క్షిపణులను ప్రయోగించవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టడమంటే ఇదేనేమో. 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించేలా దీన్ని రూపొందించారు.
ఒడిశాలోని బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO బుధవారం రాత్రి అగ్ని-ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష అన్ని లక్ష్యాలను సాధించిందని రక్షణశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలో రైలు మీద నుంచి క్షిపణులను కొన్ని దేశాలు మాత్రమే ప్రయోగిస్తాయి. ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని భారత కలిగి వుంది.
ALSO READ: సీబీఎస్ఈ పది, ఇంటర్ పరీక్ష షెడ్యూల్ వచ్చేసింది
క్షిపణుల ప్రయోగంలో దీన్ని గేమ్ ఛేంజింగ్ గా వర్ణిస్తున్నారు నిపుణులు. మొట్టమొదటి పరీక్షను రైలు ఆధారిత లాంచర్‌తో అమర్చిన స్టాటిక్ రైలు కోచ్‌లను ఉపయోగించారు. ముందస్తు పరిమితులు లేకుండా రైల్వే నెట్‌వర్క్ ద్వారా దేశమంతా వెళ్లవచ్చు. సాయుధ దళాలకు తక్కువ సమయంలో క్షిపణులను ప్రయోగించే అవకాశం దక్కింది.
ఈ క్రాస్-కంట్రీ మొబిలిటీ గణనీయమైన కార్యాచరణ సౌలభ్యాన్ని జోడిస్తుంది. దేశ రక్షణ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అగ్ని-ప్రైమ్ క్షిపణి అనేది అధునాతనమైన మధ్యంతర శ్రేణి ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. దాదాపు 2,000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను చేధిస్తుంది.
ఇందులో ఆధునిక లక్షణాలతో అమర్చబడి ఉన్నాయి. అగ్ని క్షిపణి శ్రేణి మునుపటి వెర్షన్‌లతో పోలిస్తే వంద రెట్లు బెటరని అంటున్నారు. ట్రయల్‌లో ఉపయోగించిన సాంకేతికతను భవిష్యత్తులో ఇతర అగ్నిశ్రేణి క్షిపణులకు జోడించే అవకాశముంది.
అగ్ని ప్రైమ్ క్షిపణి విజయవంతం
రైలు ఆధారిత మొబైల్ లాంఛర్ వ్యవస్థ నుంచి విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి
2000 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించేలా దీన్ని రూపొందించినట్లు ప్రకటన pic.twitter.com/m3yDV3QPf1
— BIG TV Breaking News (@bigtvtelugu) September 25, 2025