BigTV English

Jagan : ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు.. ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు..

Jagan : ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు.. ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు..


Jagan : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మూడు రోజులుగా కడప జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారు. మూడో రోజు పులివెందుల సీఎస్‌ఐ చర్చిను సందర్శించారు. అక్కడ
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ క్రిస్మస్‌ వేడుకలను జరుపుకున్నారు. చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ తోపాటు ఆయన తల్లి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని పేర్కొన్నారు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని వివరించారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు.


రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు వేడుకులు చేసుకుంటున్నారు. క్రిస్మస్ సంబరాలతో అన్ని చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×