Vedhika:సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోలకు ఇచ్చే వ్యాల్యూ హీరోయిన్లకు ఇవ్వరు అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోలను ఒకలాగా.. హీరోయిన్లను ఇంకోలాగా చూస్తున్నారు అంటూ ఎంతోమంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. గౌరవం విషయం పక్కన పెడితే.. ధరించే దుస్తులతో క్యారెక్టర్ ని కూడా డిసైడ్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి కామెంట్స్ తో విసిగిపోయిన ప్రముఖ హీరోయిన్ వేదిక (Vedhika) .. తాజాగా ఇలాంటి విమర్శలు చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది. బికినీ వేసుకొని కూడా ధరిస్తాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత మద్రాసి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది వేదిక. ఆ తర్వాత శివకాశి అనే తమిళ్ డబ్బింగ్ చిత్రంతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పలకరించింది..ఇందులో జగపతిబాబు , అర్జున్ హీరోలుగా నటించారు. ఆ తర్వాత ముని, విజయదశమి, దగ్గరగా దూరంగా, బాణం వంటి చిత్రాలు చేసిన ఈమె.. బాలకృష్ణతో రూలర్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఇటీవల వచ్చిన రజాకార్ సినిమాలో కూడా తన నటనతో అందరిని అబ్బురపరిచింది వేదిక. ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఒక్కొక్క సినిమాలో చొప్పున నటిస్తున్న ఈమె.. మరొకవైపు ఒక వర్గం ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది.
ALSO READ:Manchu Lakshmi: హాస్పిటల్ బెడ్ పై మంచు లక్ష్మీ.. ఆందోళనలో ఫ్యాన్స్!
వక్రబుద్ధి ఉన్నవారు మారాలి..
అందులో భాగంగానే వేదిక మాట్లాడుతూ.. “ఆడవారు కనిపిస్తే చాలు వారి దుస్తులను బట్టి వారి క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తున్నారు.. ఇలాంటి వక్రబుద్ధి కలిగిన వారు మొదట మారాలి. నేను బికినీ కూడా ధరించి నటిస్తాను. ఇలాంటి విమర్శలను అసలు పట్టించుకోను. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు.. అలా అని ఎవరో ఏదో అన్నారని నన్ను నేను మార్చుకోలేను కదా.. తప్పుడు బుద్ధి కలవారు మారితే అందరికీ మంచిది” అంటూ ట్రోలర్స్ కి గట్టి షాక్ తగిలేలా కామెంట్లు చేసింది వేదిక. మొత్తానికైతే వేదిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే వేదిక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బికినీ ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఈమెను తప్పుగా కామెంట్స్ చేయడం వల్లే వారిపై పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది వేదిక.
వేదిక కెరియర్..
వేదిక విషయానికి వస్తే.. 1983 ఫిబ్రవరి 21న మహారాష్ట్రలోని సోలాపూర్ లో జన్మించింది. ముంబైలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన వేదిక.. లండన్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఎంఎస్సీ పూర్తి చేసింది. కళాశాల చదువుకునే రోజుల్లోనే ఒక వీడియో ఆల్బమ్ చేసిన ఈమె.. కథక్, భరతనాట్యం కూడా నేర్చుకుంది. తమిళ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన వేదిక బెస్ట్ ఎక్స్ట్రీమ్ పర్ఫామెన్స్ అవార్డును పరదేశి సినిమా కోసం అందుకుంది. అంతేకాదు ఈ సినిమా కోసం మరో రెండు అవార్డులను కూడా అందుకుంది వేదిక.