E-Paper
Advertisement

Cement Prices: కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి వీటి ధరలు పెంపు..?

Cement Prices: కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి వీటి ధరలు పెంపు..?
Advertisement

Cement Prices: స్వేచ్ఛ బ్యూరో: సామాన్యుడిపై ధరల పిడుగు పడబోతుంది. సొంతింటికళను నెరవేర్చుకుందామనుకున్నవారికి నిరాశే మిగలనుంది. ఏప్రిల్ 1 నుంచి సిమెంట్, ఇనుము ధరలు పెరగబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ కంపెనీలు డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇదే పెరిగితే ఒక్కొక్క గృహ నిర్మాణ దారుడికి లక్షల్లో అదనపు భారం పడనుంది. అంతేకాదు ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులకు సైతం లక్ష అదనపు భారం పడుబోతుంది.

ఏప్రిల్ మొదటి వారం నుంచి..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ఇప్పుడు భారతీయ నిర్మాణ రంగాన్ని తాకనున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు, ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటంతో, దేశీయంగా సిమెంట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్ మొదటి వారం నుంచి సిమెంట్ ధరలు పెరగబోతున్టన్లు సమాచారం. ఇప్పటికే సిమెంట్ కంపెనీల డీలర్లు, ఐరన్ కంపెనీల డీలర్లకు ముందస్తు సమాచారం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సిమెంట్ సరఫరాలో ఇంధనం కీలకం కావడంతోనే ధరల పెరుగుదలకు కారణమని కంపెనీలు పేర్కొంటున్నట్లు సమాచారం.

Advertisement

Also read: చరిత్రలో కనివినీ ఎరుగని నిరసన.. 3,100 ప్రాంతాల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

టన్నుకు 2వేల నుంచి..

సామాన్యులకు, కొత్త ఇల్లు నిర్మించుకునే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సిమెంట్ బస్తా ధర సుమారు 60 రూపాయలకు పైగా పెరిగే అవకాశం ఉంది సమాచారం. దీంతో బస్తా 330 నుంచి 400 వరకు పెరుగబోతుంది. సెకండ్ క్వాలిటీ బస్తాకు సైతం 360 వరకు పెరగనుంది. దీనికి తోడు ఐరన్ సైతం టన్నుకు 2వేల నుంచి 4వేల వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఒక్కొ నిర్మాణ దారుడికి లక్షకు పైగా అదనపు భారం కానుంది. ఇది ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారికి నిరాశే కానుంది. అయితే వాటిపై ప్రభుత్వ నియంత్రణ సైతం లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు.

ధరలు పెరిగితే..

Advertisement

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌లు, హౌసింగ్‌ కన్‌స్ట్రక్షన్‌కి సిమెంట్ ప్రధానం. దీని ధరలు పెరిగితే, నిర్మాణ ఖర్చులు పెరగవచ్చు. ఇప్పటికే హై ఫ్యుయల్, ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్‌తో ఇబ్బంది పడుతున్న సిమెంట్ పరిశ్రమకు ఇది సవాల్గా మారుతుంది. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి ధరల పెరుగుదల గుదిబండ కానుంది. ప్రభుత్వం 5లక్షల రూపాయలు ఇస్తుంది. అదనంగా మరో నాలుగైదు లక్షల వరకు అవుతుంది. అయితే ఈ ధరల పెరుగుదలతో మరో 1లక్షకు పైగా భారం పడనుంది. ఇది పేదలకు సొంతింటికల కలగానే మిగిలే పరిస్థితి ఏర్పడనుంది.

Also read: Induction Stoves: అమెజాన్‌లో అత్యధికంగా.. సేల్ అవుతున్న ఇండక్షన్ స్టవ్స్.. ధర కూడా తక్కువే!

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×