E-Paper
Advertisement

Krishna – Godavari: తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం.. కేంద్రం సంచలన నిర్ణయం..

Krishna – Godavari: తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం.. కేంద్రం సంచలన నిర్ణయం..
Advertisement

తెలుగు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణలో తలెత్తుతున్న విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయం తీసుకుంది.

ఈ కమిటీలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (KRMB & GRMB) ఛైర్మన్లతో పాటు.. జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA) చీఫ్ ఇంజనీర్, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్‌లను సభ్యులుగా నియమించారు. సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, రెండు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలను సూచించడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం.

Advertisement

ముఖ్యంగా, ఈ కమిటీలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు కూడా ప్రాధాన్యత కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుండి నలుగురు, తెలంగాణ నుండి నలుగురు ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. దీనివల్ల రాష్ట్రాల వాదనలను నేరుగా కమిటీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించనుంది.

ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద నీటి వినియోగం, విద్యుత్ ఉత్పత్తి, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలకు ముగింపు పలకడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

ALSO READ: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని బూతులమయం చేశారు.. హరీష్ రావు ఫైర్

Related News

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×