Palamuru-Ranga Reddy project: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలల నుంచి ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలనే డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం పలు సార్లు కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. జాతీయ హోదా కోసం కేంద్రాన్ని ప్రభుత్వం సంప్రదించి చాలా సార్లు రిక్వెస్ట్ కూడా చేసింది. అయితే, ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిక్వెస్ట్ పై ఇవాళ కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రాజెక్టులో సాంకేతిక, ఆర్థిక మదింపు లేకుండా.. జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం అవ్వదని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును 2015 జూన్ నెలలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ వద్ద కృష్ణా నది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తి పోయడ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. దీని ద్వారా పాలమూరులో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్గొండ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2023 సెప్టెంబర్ లో నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారింభించారు. జాతికి కూడా అంకితం చేశారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్లు వల్ల ఆరు జిల్లాలకు మేలు జరగనుంది. హైదరబాద్ మహా నగరానికి పారిశ్రామిక అవసరాలకు నీరు, అలాగే డ్రింకింగ్ వాటర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగు నీరుతో పాటు సాగు నీరు కూడా అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు.
నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం లోని నీటిని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం లక్ష్మీదేవి పల్లి వరకు నీటిని పంపించే లక్ష్యంతో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వానలు బాగా పడే సమయంలో 1.5 టీఎంసీ చొప్పున మొత్తం 90 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలి అనేది ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించారు.