BigTV English

Musi River: మూసీ ప్రక్షాళణ.. కేంద్రానికి ఇష్టం లేదా..?

Musi River: మూసీ ప్రక్షాళణ.. కేంద్రానికి ఇష్టం లేదా..?

లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్ట్ తరహాలో హైదరాబాద్ లో మూసీ నది అభివృద్ధికి రేవంత్ రెడ్డి సర్కారు ప్రణాళికలు రచించింది. మూసీ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ప్రపంచ బ్యాంకు రుణంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలనుకుంటున్నారు. మొత్తం సుందరీకరణ పనులకు, రూ.5863 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో రూ.4100 కోట్లు రుణంగా ఇస్తే, మిగిలిన రూ.1763 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్ లో పడింది. తెలంగాణ అభివృద్ధికి సాయం చేస్తున్నామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ క్రెడిట్ దక్కకుండా చేసేందుకు మూసీ ప్రాజెక్ట్ పై కేంద్రం కొర్రీలు వేస్తోందని అంటున్నారు నేతలు.


తెలంగాణ అభివృద్ధిపై తన మార్కు చూపెట్టాలనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ అనే అతి పెద్ద ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకున్నారు. లండన్ పర్యటనలో అధికారులతో కలసి ఆయన థేమ్స్ నది పరిసరాలను గమనించారు. లండన్ లో థేమ్స్ తరహాలోనే హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నట్టు గుర్తించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తో.. మూసీ నది ప్రక్షాళణ కావడంతోపాటు.. చుట్టు పక్కల ప్రాంతాలు కూడా పర్యాటక శోభ సంతరించుకుంటాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే దీనికి బడ్జెట్ కీలకంగా మారింది. రూ.5863 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. దీంతో వరల్డ్ బ్యాంక్ ని తెలంగాణ ప్రభుత్వం సంప్రదించింది. అయితే ఇక్కడ కేంద్రం రికమండేషన్ కీలకం.

కేంద్రం బ్రేక్..
మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడాని సుముఖంగా ఉంది. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆరు నెలల క్రితమే సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే అక్కడినుంచి వరుసగా ఈ ప్రాజెక్ట్ కి బ్రేక్ లు పడుతూ వస్తున్నాయి. విదేశీ రుణాలను అనుమతించే ఆర్థిక వ్యవహారాలశాఖ ఇక్కడ కీలకంగా మారింది. ప్రపంచ బ్యాంక్ రుణానికి తాము సిఫారసు చేస్తామని చెబుతూనే.. అదే సమయంలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లు సాంకేతికంగా అనుమతి పొందాలని కండిషన్ పెట్టింది. ఆ కండిషన్లన్నీ దాటుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఇంకొన్ని కొత్త కండిషన్లు తెరపైకి వచ్చాయి. డీపీఆర్‌తో పాటు పర్యావరణ అనుమతి, ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ విషయంపై కూడా మరింత సమాచారం రావాలన్నది కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ. దీంతో ఈ వ్యవహారం మరింత ఆలస్యమయ్యేలా కనపడుతోంది.


2030 డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా
మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రపంచబ్యాంకు రుణం ప్రాథమిక నివేదిక పంపింది. మూసీ నది పునరుజ్జీవంతోపాటు.. పరివాహక ప్రాంతాల ఆర్థిక, పర్యాటక వృద్ధికి ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుందని తెలిపింది. మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు, హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని చాటేందుకు కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని చెప్పింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని చేపడుతున్నామని, 2030 డిసెంబర్ ని డెడ్ లైన్ గా పెట్టుకుని పనులు మొదలు పెడతామని స్పష్టం చేసింది. అయితే కేంద్రం తాత్సారం చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు మొదలవుతాయనే విషయంలో స్పష్టత రావడంలేదు.

Related News

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Big Stories

×