Avocado: అవకాడో, దీనిని “మాఖన్ ఫలం” లేదా “బటర్ ఫ్రూట్” అని కూడా పిలుస్తారు. ఇది పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన ఆహారం. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. అవకాడోలోని ప్రధాన ప్రయోజనాలు గురించి, ఏ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు అవకాడో తినకూడదనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అవకాడో ఆరోగ్య ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యం: అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవకాడోలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
కంటి ఆరోగ్యం: అవకాడోలో లుటీన్ , జియాక్సంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతే కాకుండా వయస్సు సంబంధిత కంటి సమస్యలైన మాక్యులర్ డీజెనరేషన్ , కంటి శుక్లాల నుండి రక్షణ కల్పిస్తాయి.
జీర్ణ ఆరోగ్యం: అవకాడోలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఫైబర్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం.
బరువు నియంత్రణ: అవకాడోలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం: అవకాడోలో విటమిన్ E , C ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా , ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. అంతే కాకుండా ముడతలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. అవకాడో నూనె జుట్టును బలోపేతం చేస్తుంది.
అవకాడో ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినడం మానుకోవాలి లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
వీళ్లు అవకాడో తినకూడదు :
అలెర్జీలు: కొందరికి అవకాడో అలెర్జీ ఉండవచ్చు. లాటెక్స్-ఫ్రూట్ సిండ్రోమ్ ఉన్నవారు, లాటెక్స్‌కు అలెర్జీ ఉన్నవారు అవకాడో తినడం వల్ల దురద, వాపు, లేదా శ్వాస సమస్యలను ఎదుర్కోవసి రావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అవకాడో తినడం ఆపాలి.
మూత్రపిండ సమస్యలు: అవకాడోలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండ వ్యాధి ఉన్నవారు లేదా డయాలసిస్‌లో ఉన్నవారు పొటాషియం తీసుకోవడం పరిమితం చేయాలి.
కాలేయ సమస్యలు: అవకాడోలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాలేయ వ్యాధి ఉన్నవారు దీనిని అధికంగా తినడం మానుకోవాలి. ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నవారు అవకాడో తినే ముందు వైద్య సలహా తీసుకోవాలి.
Also Read: తరచుగా జుట్టు జిడ్డుగా మారుతోందా ? పరిష్కారం ఇదిగో !
జీర్ణ సమస్యలు: అవకాడోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవారు దీనిని తినడం వల్ల అసౌకర్యం, వాంతులు, లేదా అతిసారం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
అవకాడో ఒక పోషకమైన ఆహారం.. ఇది గుండె, కంటి, చర్మం, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే.. అలెర్జీలు, మూత్రపిండ లేదా కాలేయ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు లేదా మందులు తీసుకునే వారు దీనిని తినే ముందు జాగ్రత్త వహించాలి. తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.