BigTV English

Chaddi Gang in Hyderabad: హైదరాబాద్ లో మరో సారి రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్.. ఏకంగా రూ.7.8 లక్షలు చోరీ

Chaddi Gang in Hyderabad: హైదరాబాద్ లో మరో సారి రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్.. ఏకంగా రూ.7.8 లక్షలు చోరీ
Chaddi Gang news
Chaddi Gang

Chaddi Gang in Miyapur: హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రశాంతంగా ఉన్న నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ అలజడి సృష్టించింది. మియాపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో అర్థరాత్రి చోరీకి పాల్పడ్డారు. ముఖానికి గత కొన్ని రోజులుగా ఎటువంటి దొంగతలానకు పాల్పడని వీరు.. ఆ పాఠశాలలో చొరబడి కౌంటర్ లో ఉన్న రూ. 7 లక్షల 85 వేల నగదును ఎత్తుకెళ్లారు.


మియాపూర్ ప్రాంతం హఫీజ్ పేట్ లోని విజ్ఞాన్ వరల్డ్ వన్ అనే స్కూల్ లో శనివారం(మార్చి 16) అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. నల్లని ముసుగులు, కేవలం చెడ్డీ మాత్రమే ధరించిన ఇద్దరు చెడ్డీ గ్యాంగ్ దొంగలు స్కూల్ లోనికి ప్రవేశించారు. అనంతరం స్కూల్ కార్యాలయంలోని కౌంటర్ వద్దకు వెళ్లి అందులో ఉన్న రూ.7.85 లక్షల డబ్బులను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ స్కూల్‌లో ప్రవేశించిన దొంగతానికి పాల్పడిన దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. ఆదివారం ఉదయం స్కూల్ కు వచ్చిన యాజమాన్యం జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ నగరంలో గతేడాది ఆగస్టు 11న కూడా మియాపూర్ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు వసంత విలాస్‌లో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. అయితే అదే సమయంలో దొంగతనాలికి పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ సభ్యుల్లో కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Also Read: Hail Showers in Telangana : తెలంగాణలో వడగండ్ల వానలు.. 4 రోజులు భారీవర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

మళ్లీ చాలా నెలలు తర్వాత చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడడంతో హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ గ్యాంగ్ మరీ ముఖ్యంగా శివారు ప్రాంతాలను, గేటెడ్ కమ్యూనిటీలోని ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతోంది. ఈ గ్యాంగ్ చెడ్డీలు ధరించి తప్పించుకునేందుకు వీలుగా ఒళ్లంతా ఆయిల్ పూసుకొని దొంగతాలను వెళ్తారు. దొంగతనం చేసే సమయంలో వారిని పట్టుకోడానికి ప్రయత్నిస్తే వీరు ఎవరినైనా సరే చంపడానికి కూడా వెనుకంజవేయరు. అంతటి డేంజరస్ ఈ చెడ్డీ గ్యాంగ్ దొంగలు. లాంగ్ వీకెండ్‌లు, సెలవులు రోజుల్లో చెడ్డీ గ్యాంగ్ ఎక్కువగా చోరీలకు పాల్పడతారని ఇదివరకే పోలీసులు గుర్తించారు.

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×