E-Paper
Advertisement

‘మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు దేవుడా!’.. కన్నీరు పెట్టిస్తున్న వరంగల్ దంపతుల సూసైడ్ నోట్!

‘మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు దేవుడా!’.. కన్నీరు పెట్టిస్తున్న వరంగల్ దంపతుల సూసైడ్ నోట్!
Advertisement

Warangal Couple: ఆత్మాభిమానమే ఆస్తిగా బతికే మధ్యతరగతి మనిషికి కడుపు నిండా తిండి లేకపోయినా పర్వాలేదు కానీ, నలుగురిలో తలదించుకునే అవమానం ఎదురైతే మాత్రం ప్రాణాలే వదులుకుంటాడు. వరంగల్ జిల్లా రంగశాయిపేటలో జరిగిన ఓ హృదయ విదారక ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. అప్పు ఇచ్చిన వారి సూటిపోటి మాటలు భరించలేక ఓ వృద్ధ జంట తమ పెంపుడు కుక్కకు విషమిచ్చి, తామూ ఉరివేసుకుని తనువు చాలించింది.

అసలేం జరిగింది?

Advertisement

రంగశాయిపేట పరిధిలోని ఎస్‌బీఐ కాలనీలో నల్లపోగుల సంజయ్ కుమార్ (60), ఆయన భార్య శోభ (53) అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. సంజయ్ కుమార్ ప్రైవేట్ డ్రైవర్‌గా, శోభ టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు వివాహమై వృత్తి రీత్యా ముంబైలో స్థిరపడ్డారు. కుటుంబ అవసరాల కోసం ఈ దంపతులు గతంలో కొన్ని అప్పులు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సకాలంలో వడ్డీలు చెల్లించలేకపోయారు.

కుంగదీసిన ఆ ఒక్క మాట!

Advertisement

వడ్డీల కోసం ఇంటికి వచ్చిన అప్పుల వారు.. ‘మీకే తిండికి దిక్కు లేదు.. మళ్లీ పెంపుడు కుక్క ఎందుకు?’ అంటూ తీవ్రంగా అవమానించారు. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న శునకాన్ని ఉద్దేశించి అన్న ఆ మాటలు వారి మనసును తీవ్రంగా గాయపరిచాయి. ఈ అవమాన భారంతో కుంగిపోయిన దంపతులు.. మొదట తమ పెంపుడు కుక్కకు విషమిచ్చి చంపారు. ఆ తర్వాత తాము కూడా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అక్కడ దంపతులు రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ‘అప్పు ఇచ్చిన వారి అవమానాలు తట్టుకోలేక.. ముంబైలో ఉన్న మా కొడుకులకు భారం కావొద్దనే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నాం. మాతో పాటే జీవించిన మా కుక్కకు కూడా మాతోనే దహన సంస్కారాలు చేయండి. దేవుడా.. మరుజన్మ అంటూ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు’ అని ఆ లేఖలో రాసి ఉండటం స్థానికులను కంటతడి పెట్టించింది.

Also Read: ‘నా భార్య ఇజ్జత్ తీస్తోంది.. బతకాలని లేదు’.. సెల్ఫీ వీడియో పెట్టి యువకుడి అదృశ్యం

Tags

Related News

‘నా భార్య ఇజ్జత్ తీస్తోంది.. బతకాలని లేదు’.. సెల్ఫీ వీడియో పెట్టి యువకుడి అదృశ్యం

ఎర్ర బస్సు స్టయిల్‌లో.. విమానం ఎక్కిన పల్లెటూరు దంపతులు, వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. తప్పిన ముప్పు

హైదరాబాద్‌ సిటీలో మరోసారి భూముల అమ్మకం.. ఏయే ప్రాంతాలు, ఈ-ఆక్షన్ తేదీలు ఇవే!

ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయం చాలా ప్రమాదకరం.. ఎలానో క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత!

తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల..?

కాంగ్రెస్ అభయ హస్తం మొత్తం శూన్య హస్తమే.. హరీష్ రావు ఫైర్!

Big Stories

Advertisement
×