Pak vs Afghan: పాక్- ఆఫ్ఘన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం యుద్ధ పరిస్థితి పెరుగుతూనే ఉంది. కాల్పుల విరమణ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని చూపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా క్రికెటర్లను టార్గెట్ చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ సరిహద్దుల్లో సమావేశం ఉన్న ఆఫ్ఘన్‌ల క్రికెటర్ల పై అర్థరాత్రి బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు క్రికెటర్లతో పాటు ఐదుగురు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురు ఆటగాళ్ళు సిబాతుల్లా, కబీర్ అఘా, హరూన్ గా గుర్తించారు. వీళ్లు ఆర్గున్ క్రికెట్ టీంకి ఆడుతున్నట్లు సమాచారం. పాక్-శ్రీలంక ట్రై సిరీస్ సమయంలో ఈ దాడి జరగడంతో పాకిస్తాన్ పిరికి తనంగా భావిస్తుంది ఆఫ్ఘన్. దీంతో ఆఫ్ఘన్ ట్రైసిరీన్ ని రద్దు చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా తాలిబాన్లు కూడా దాడి చేసేందుకు సిద్ధమయ్యారు.