Bigg Boss 9 Promo: వీకెండ్ ఎపిసోడ్ ప్రొమో వచ్చింది. అందరు ఊహించినట్టుగా ఈసారి కింగ్ ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. వచ్చిరాగానే కంటెస్టెంట్స్కి క్లాస్ పీకాడు. హౌజ్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఉంటే వారిలో ఎక్కువ ఫోకస్ అవుతుంది మాత్రం ఆయేషా, మాధురినే. వచ్చినప్పటి నుంచి వీరిద్దరి తీరు హౌజ్‌మేట్స్ కే కాదు ఆడియన్స్కి విసుగు తెప్పిస్తుంది. కదిలిస్తే నోరేసుకుని పడిపోతున్నారు. అరుపులు, గొడవలు తప్పితే వీరి ఆట ఏం కనిపించడం లేదు. ఇదే వీకెండ్ ఎపిసోడ్ నాగార్జున అన్నారు. వచ్చిన రోజే మాధురి పాత హౌజ్మేట్స్తో చాలా దురుసుగా ప్రవర్తించింది. హౌజ్ కి తనే బిగ్ బాస్ అన్నట్టుగా ఓవర్ చేస్తుంది.
వంట దగ్గర నేనే బిగ్ బాస్ అన్నట్టుగా బిహెవ్ చేసింది. అదేంటని అడిగితే నా ఇష్టం అంటూ గొడవలకు దిగుతోంది. కళ్యాణ్ కూర్చోండి.. మాట్లాడాలి అన్నందుకు మాధురి చేసిన రచ్చ తెలిసిందే. ఈ విషయంలో తప్పేవరిదని నాగార్జున సుమన్ శెట్టిని అడిగాడు. అసలేమాత్రం తడుముకోకుండ సుమన్ మాధురిదే తప్పు అన్నాడు. మాధురికి క్లాస్ పీకాడు. మీరు ఇలా మాట్లాడితే నేను మరోలా మాట్లాడాల్సి వస్తుందని కళ్యాణ్ అనడంతో తను అలా రియాక్ట్ అయ్యానని కవర్ చేసుకుంది మాధురి. దీంతో కింగ్ వీడియో ప్లే చేసి చూపించాడు. తన మాట తీరే ఇలా అంటూ సంజాయిషి ఇచ్చుకుంటున్న మాధురి మాటలను ఖండించారు. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. కానీ, మాట్లాడిన తీరు తప్పు అని కళ్యాణ్ ని హెచ్చరించాడు.
ఆ తర్వాత మన మాటే మనల్ని అందలం ఎక్కిస్తుందని, ఇకనైనా తీరు మార్చుకో అంటూ క్లాస్ పీకారు. ప్రారంభంలో వైల్డ్ కార్డ్స్ కోసం తెచ్చిన కీరిటాలను తెప్పించి వారికి ఇచ్చారు. పవర్ ఆఫ్ నామినేషన్‌కి వీళ్లు అర్హులా, కాదా అని ఓటింగ్ పాయింట్ పెట్టారు. ఇందులో మాధురి అనర్హురాలని ఆడియన్స్ తేల్చారు. దీంతో ఆమె షీల్డ్ నుంచి పవర్ స్టోన్ తీసేశారు. ఆ తర్వాత ఆయేషా అర్హురాలా కాదా అని తనూజ, రీతూని కూడా అడిగారు. తనూజ .. అర్హురాలు అని చెప్పింది.
Also Read: Bigg Boss Telugu: బిగ్‌బాస్‌పై కేసు, నోటీసు చూసి పారిపోయిన నాగార్జున.. సీపీఐ నారాయణ కామెంట్స్
తను ముందే ఒక టార్గెట్ పెట్టుకుని వచ్చిందని వివరణ ఇస్తుండగా తన టార్గెట్ నువ్వే కదా.. అయినా తను అర్హురాలేనా అని తనూజకి షాకిచ్చాడు. ఆ తర్వాత రీతూ తన జడ్జిమెంట్ చేప్పడంలో తడబడింది. మొదట అర్హురాలు అని ఆ తర్వాత కాదంటూ రెండు జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, భరణిలను అఖిల్, సాయిల గురించి అడగ్గా.. వాళ్లకి ఉన్న బలం, గేమ్స్ చూస్తుంటే వారికి నామినేషన పవర్ ఇవ్వడం అంత ముఖ్యం కాదనిపిస్తోందని అభిప్రాయం చెప్పారు. వీక్ పీపుల్ కే పవర్ ఇస్తారా? బలమైన వాళ్లకే కదా పవర్ ఇస్తారని నాగార్జున ఖండించడంతో వారి నోట మాట రాలేదు. దీంతో ప్రొమో ముగిసింది.