E-Paper

అంతర్జాతీయ TEDx వేదికపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రసంగం

అంతర్జాతీయ TEDx వేదికపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రసంగం
Advertisement

Mahabubnagar Education: మహబూబ్‌నగర్ జిల్లా పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగబోతోంది. ప్రతిష్టాత్మకమైన ‘TEDx నోయిడా’ వేదికపై ఈ నెల 4వ తేదీన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రసంగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మేధావులు, వినూత్న ఆలోచనలు ఉన్నవారే ఈ వేదికపై మాట్లాడే అవకాశం సాధిస్తుంటారు. అయితే రాజకీయ నాయకులకు ఇలాంటి అంతర్జాతీయ వేదికల నుంచి ఆహ్వానం లభించడం అత్యంత అరుదైన విషయం. ఈ నేపథ్యంలో పాలమూరు మట్టి బిడ్డకు దక్కిన ఈ గౌరవం పట్ల నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యా రంగంలో సరికొత్త విప్లవం
ఈ అంతర్జాతీయ వేదికపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో తాము చేపట్టిన విద్యా విప్లవాన్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ అనే వినూత్న సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఆయన చేస్తున్న కృషి అద్భుతమైనది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రసంగంలో ఆయన స్థానిక పాఠశాలల్లో తీసుకొచ్చిన మౌలిక వసతుల మార్పులు, ఉపాధ్యాయులకు కల్పిస్తున్న శిక్షణ వంటి కీలక అంశాలను ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.

Advertisement

డిజిటల్ విద్య వైపు అడుగులు..
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వెనుకబడిపోకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రెండు వినూత్న కార్యక్రమాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అవే “మై విలేజ్ స్కూల్”, “QR కోడ్ డిజిటల్ లెర్నింగ్”. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ విద్యను అనుసంధానం చేస్తూ, స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ద్వారా విద్యార్థులకు క్లిష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. పుస్తకాల్లోని పాఠాలను QR కోడ్స్ ద్వారా స్కాన్ చేసి, ఆడియో-విజువల్ రూపంలో విద్యార్థులకు సరికొత్త అభ్యాస అనుభవాన్ని అందిస్తున్నారు. ఈ విప్లవాత్మక డిజిటల్ మోడల్ గురించే యెన్నం గారు TEDx వేదికపై సమగ్రంగా వివరించనున్నారు.

పాలమూరు ప్రజలకు దక్కిన అంతర్జాతీయ గౌరవం
సాధారణంగా మేధావులు, నోబెల్ గ్రహీతలు, సమాజంలో గొప్ప మార్పు తెచ్చిన సామాజికవేత్తలు మాత్రమే మాట్లాడే TEDx వేదికపై.. మన తెలుగు నేలకు చెందిన ఒక ప్రజాప్రతినిధి నిలబడటం నిజంగా గర్వకారణం. భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలిచే ఆలోచనలను పంచుకునే ఈ స్వతంత్ర వేదిక ద్వారా, మహబూబ్‌నగర్ విద్యా విధానం దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాలకు ఒక రోల్ మోడల్‌గా నిలవబోతోంది. ఈ అరుదైన అవకాశం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారి నిరంతర శ్రమకు, దూరదృష్టికి దక్కిన సముచిత గౌరవమని నగర మేధావులు, విద్యావేత్తలు కొనియాడుతున్నారు.

Advertisement

Also Read: తమిళనాడులో బిగ్గెస్ట్ పొలిటికల్ త్రిల్లర్.. విజయ్ సర్కార్‌ను పడగొట్టేందుకు రూ. 180 కోట్ల సీక్రెట్ డీల్!

Related News

‘TRS’ పేరు కుదరదు.. కొత్త పేరు చూస్కోండి.. కవితకు ఈసీ అల్టిమేటం!

తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. హోంశాఖలో భారీ ఉద్యోగాల జాతర!

జడ్పీటీసీ To సీఎం.. మిడ్జిల్ మట్టి బిడ్డ రేవంత్ రెడ్డి 20 ఏళ్ల ప్రస్థానం.. నేడు సొంత గడ్డపై కృతజ్ఞత జాతర!

ఏపీ, తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. నేటి నుంచి దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్!

మేము చెప్పిన లెక్కలకే కట్టుబడి ఉన్నాం.. మంత్రి జూపల్లికి హరీష్ రావు బహిరంగ లేఖ!

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడాలి: గోమారం రమణారెడ్డి

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే.. దేవుడి పేరుతో మోసాలు చాలు.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

×