E-Paper
Advertisement

హైవే యాక్సిడెంట్ చూస్తే ఆమడ దూరం పారిపోయేలా చేసే మూవీ… ఆగితే అస్సలు వదలని దెయ్యం

హైవే యాక్సిడెంట్ చూస్తే ఆమడ దూరం పారిపోయేలా చేసే మూవీ… ఆగితే అస్సలు వదలని దెయ్యం
Advertisement

Supernatural Horror on OTT:  రోడ్ ట్రిప్ అంటే… ఫ్రెండ్స్‌తో సరదా, కొత్త ప్రదేశాలు, అందమైన జ్ఞాపకాలు. కానీ అదే ప్రయాణంలో ఓ ఘోరమైన యాక్సిడెంట్ కనిపిస్తే ? దానికి సహాయం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత… తమతో పాటు మరో వ్యక్తి కూడా వ్యాన్‌లోకి వచ్చాడని తెలిస్తే ? అతను మనిషి కాదు… కనిపించని ఓ దుష్టశక్తి అని అర్థమైతే ? ఎక్కడికి పారిపోయినా వెంటాడుతూ, క్షణక్షణం భయపెడుతూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇలాంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సూపర్‌నేచురల్ హారర్ మూవీ ‘ప్యాసింజర్’ (Passenger) తాజాగా ఓటీటీలోకి వచ్చింది. మరి మ్యాడీ, టైలర్‌ల రోడ్ ట్రిప్ ఎలా భయంకరంగా మారింది ? వాళ్లతో పాటు ప్రయాణిస్తున్న ఆ ‘ప్యాసింజర్’ ఎవరు? దాని నుంచి ఈ జంట బయటపడిందా ? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

మ్యాడీ, టైలర్ అనే యువ జంట అమెరికా అంతటా వ్యాన్‌లో లాంగ్ రోడ్ ట్రిప్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు. రొటీన్ జీవితానికి దూరంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ, కొత్త ప్రదేశాలను చూసుకుంటూ సాగిపోవాలన్నది వారి కోరిక. ప్రయాణం మొదట్లో చాలా ఆనందంగానే ఉంటుంది. కానీ ఓ హైవేపై వారి ప్రయాణం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. దారిలో ఓ ఘోరమైన రోడ్డు ప్రమాదాన్ని చూసిన ఈ జంట వెంటనే తమ వ్యాన్ ఆపి, సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది.

Advertisement

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ తమతో పాటు ఆ ప్రదేశం నుంచి మరో శక్తి కూడా ప్రయాణం మొదలుపెట్టిందని వారికి తెలియదు. కొద్దిసేపటికే వ్యాన్‌లో వింత సంఘటనలు మొదలవుతాయి. కనిపించని ఏదో శక్తి తమను గమనిస్తోందని మ్యాడీ, టైలర్‌కు అర్థమవుతుంది. మొదట భ్రమ అనుకున్నా.. పరిస్థితులు మరింత భయంకరంగా మారడంతో అది నిజంగానే తమతో పాటు వచ్చిన దుష్టశక్తి అని తెలుసుకుంటారు.

అదే ‘ది ప్యాసింజర్’. ఆ శక్తి వారి వ్యాన్‌ను వదిలి వెళ్లదు. ఎంత దూరం వెళ్లినా, ఎంత వేగంగా ప్రయాణించినా వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడ ఆగినా ప్రమాదం… ఏ నిర్ణయం తీసుకున్నా మరో భయం… దీంతో వాళ్ల సరదా రోడ్ ట్రిప్ కాస్తా ప్రాణాల కోసం చేసే పోరాటంగా మారుతుంది. ఈ కథలో మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… రోడ్ ట్రిప్స్‌కు సంబంధించిన ఓ భయంకరమైన గణాంకం. ప్రతి ఏడాది కోట్లాది మంది రోడ్ ట్రిప్స్‌కు వెళ్తుంటే, వారిలో వేలాది మంది అదృశ్యమవుతున్నారనే ఆలోచన ఆధారంగా ఈ హారర్ కాన్సెప్ట్‌ను రూపొందించారు.

Advertisement

మరి మ్యాడీ, టైలర్ ఆ అదృశ్య శక్తి నుంచి తప్పించుకోగలిగారా ? ప్రమాద స్థలంలో అసలు ఏం జరిగింది ? వాళ్లను వెంటాడుతున్న ‘ప్యాసింజర్’ ఉద్దేశం ఏంటి ? చివరికి ఈ భయానక ప్రయాణం ఎక్కడ ముగిసింది ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో ఉందా లేదా ?

‘ప్యాసింజర్’లో రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌ను సూపర్‌నేచురల్ హారర్‌తో కలిపారు. నిర్జనమైన రోడ్లు, వ్యాన్‌లో చిక్కుకుపోయిన జంట, కనిపించని శక్తి… ఇవన్నీ సినిమాలో టెన్షన్ పెంచే అంశాలుగా నిలుస్తాయి. సాధారణ దెయ్యం కథల కంటే భిన్నమైన రోడ్-హారర్ కాన్సెప్ట్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం ‘ప్యాసింజర్’ పారామౌంట్ ప్లస్‌ (Paramount+)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ లేదా తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో లేవు. ప్రస్తుతానికి ఇంగ్లీష్‌లోనే చూడాల్సి ఉంటుంది.

Read Also: అమ్మకు క్యాన్సర్… కూతురికి ఆటిజం… కానీ ఈ అమ్మాయి చేసిన పని చూస్తే గర్వపడతారు భయ్యా

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×