E-Paper
Advertisement

సవాల్ విసిరి ఎందుకు వెనక్కి తగ్గారు? మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

సవాల్ విసిరి ఎందుకు వెనక్కి తగ్గారు? మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!
Advertisement

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగింది. ‘తెలంగాణ భవన్‌’కు వెళ్తామంటూ సవాల్ విసిరి, తీరా గన్ పార్క్ వద్దకు వచ్చాక వెనక్కి తగ్గడంపై కాంగ్రెస్ వర్గాల్లో పెను కలకలం సృష్టించింది. తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సవాల్ విసిరిన తర్వాత వెనకడుగు వేయడం వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని, పైగా ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా అస్త్రం ఇచ్చినట్లయిందని సీఎం మంత్రులకు గట్టిగానే క్లాస్ పీకారు.

గన్ పార్క్ వద్ద అసలేం జరిగింది?
నిజానికి, బీఆర్ఎస్ నేతలతో సవాల్ ప్రతిసవాళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు కొందరు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించి, నేరుగా బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు వెళ్తామని ప్రకటించారు. అయితే, గన్ పార్క్ వద్ద కొంత సమయం వేచి చూసిన మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు రాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమైంది. “బీఆర్ఎస్ నేతలు వచ్చే వరకు అక్కడే ఎందుకు వేచి ఉండలేదు? అంత తొందరగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది?” అంటూ సీఎం మంత్రులను నిలదీసినట్లు సమాచారం.

Advertisement

సెల్ఫ్ డిఫెన్స్‌లో కాంగ్రెస్.. ముఖ్యమంత్రి అసంతృప్తి!
ఈ వ్యూహాత్మక తప్పిదం వల్ల కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ఆత్మరక్షణలో పడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నేతలు వచ్చే వరకు గన్ పార్క్ వద్దే కూర్చుని ఉంటే రాజకీయంగా కాంగ్రెస్‌ మైలేజ్ పెరిగేదని, కానీ మధ్యలోనే వచ్చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని ఆయన మంత్రులకు వివరించారు. ఒక వైపు తాము దూకుడుగా వెళ్తుంటే, మంత్రుల అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రతిపక్షానికి విమర్శలు చేసే అవకాశం దక్కిందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

సవాల్ చేస్తే వెనక్కి తగ్గొద్దు: రేవంత్ రెడ్డి క్లాస్
రాజకీయాల్లో ఒకసారి సవాల్ విసిరిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలని, అప్పుడే ప్రజల్లో నమ్మకం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి గందరగోళ పరిస్థితులకు తావివ్వద్దని, ఏ నిర్ణయమైనా పక్కా వ్యూహంతోనే అమలు చేయాలని ఆదేశించారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన కాంగ్రెస్ శ్రేణులు, బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సవాల్ రాజకీయం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Advertisement

Also Read: ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

Related News

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

బైకుపై పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. కేబీఆర్ పార్క్ వన్‌వే ట్రాఫిక్ పరిశీలన

నిజామాబాద్ కాంగ్రెస్‌లో హైటెన్షన్.. పోచారంని సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్!

Big Stories

Advertisement
×