E-Paper
Advertisement

హైదరాబాద్‌లో దారుణం.. మేకకు ఎద్దు మాంసం, హెచ్-ఫాస్ట్ బృందం తనిఖీల్లో షాకింగ్ విషయాలు

హైదరాబాద్‌లో దారుణం.. మేకకు ఎద్దు మాంసం, హెచ్-ఫాస్ట్ బృందం తనిఖీల్లో షాకింగ్ విషయాలు
Advertisement

Hyderabad: కల్తీ.. కల్తీ.. కల్తీ.. హైదరాబాద్ సిటీలో అధికారులు చేస్తున్న దాడులు కల్తీ ఐటమ్స్ బయటపడుతున్నాయి. ఆయిల్, అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఇంకా చెప్పాలంటే మనం మాంసం కూడా. తాజాగా హైదరాబాద్ సిటీలోని హెచ్-ఫాస్ట్ అధికారులు ఓ మటన్ షాపుపై తనిఖీ చేపట్టారు. సుమారు 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మేక మాంసం బదులు ఎద్దు మాంసం అమ్ముతున్నట్లు తేలింది.

హైదరాబాద్‌లో దారుణం.. మేకకు బదులు ఎద్దు మాంసం అమ్మకం

Advertisement

హైదరాబాద్‌లో ఒకప్పుడు ఫుడ్, మటన్ తినడానికి భోజనం ప్రియులు మొగ్గు చూపేవారు. అందుకోసం హోటళ్లలో గంటల కొద్దీ వెయిట్ చేసేవారు.  ఇదంతా ఒకప్పటి మాట. పరిస్థితులు మారడంతో కల్తీలు మొదలయ్యాయి.  మల్లేపల్లిలో హబీబ్‌నగర్ ప్రాంతంలో ఓ మటన్ షాపుపై హెచ్-ఫాస్ట్ అధికారులు దాడులు చేపట్టారు.

మేక మాంసానికి బదలు ఎద్దు మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఉస్మాన్ మీట్ షాప్ నుంచి దాదాపు 50 కిలోల మాంసాన్ని సీజ్ చేశారు. వాటి నమూనాలను ప్రయోగశాలకు తరలించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు సిద్ధమవుతున్నారు అధికారులు. అసలు ఈ వాస్తవాన్ని ఎలా పసిగట్టారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

Advertisement

హెచ్-ఫాస్ట్ బృందం తనిఖీల్లో షాకింగ్ విషయాలు

హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మీట్ షాప్‌లో కల్తీ మాంసం అమ్ముతున్నారని కొందరికి అనుమానం వచ్చింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దాని గురించి దర్యాప్తు చేపట్టిన తర్వాత నిజమేనని నిర్ధారించుకున్నారు. స్థానిక పోలీసులతో కలిసి H-FAST అధికారులు మటన్ షాపుపై సంయుక్తంగా దాడులు చేశారు.

విక్రయానికి ఉంచిన మాంసాన్ని పరిశీలించారు. అది మేక మాంసం కాదని ప్రాథమికంగా నిర్థారించారు. షాపు అంతా తనిఖీలు చేస్తే  ఏకంగా 50 కిలోల ఎద్దు మాంసం పట్టుబడింది. ఈ ఘటనకు మీట్ షాప్ యజమాని ఉస్మాన్ ఖురేషిపై కేసు నమోదు చేశారు హబీబ్‌నగర్ పోలీసులు. ల్యాబ్ నివేదిక తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కల్తీ ఎంతకాలంగా జరుగుతోంది?

ALSO READ: వాతావరణ శాఖ చల్లని కబురు.. వారం రోజుల పాటు దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్!

ఇందులో ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? కేవలం షాపు ఓనర్ ఈ విధంగా బరితెగించాడా? అనేదానిపై దర్యాప్తులో నిమగ్నమయ్యారు పోలీసులు. హైదరాబాద్ సిటీలో కొన్నాళ్లు ఓ వైపు ఫుడ్ అధికారులు హోటళ్లలో కొరడా ఝలిపిస్తున్నారు. మరోవైపు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ ఆహార మాఫియాపై H-FAST దాడులు చేస్తున్నారు.

ఫలితంగా రోజు లేదా రెండు రోజుల కొకసారి కల్తీ ఆహారాలు బయటపడుతున్నాయి. కొన్నాళ్లుగా నిద్రపోయిన అధికారులు, పైస్థాయి అధికారులు ఒత్తిడితో రంగంలోకి దిగారు. అన్నట్లు మొన్నటికి మొన్న దేశంలోని మెట్రో నగరాల్లో ఆహార పరిశుభ్రత రేటింగ్‌లో హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే.

 

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×