BigTV English

Drones : పురుగుల నుండి వరి పంటను కాపాడే డ్రోన్లు..

Drones : పురుగుల నుండి వరి పంటను కాపాడే డ్రోన్లు..
Drones

Drones : టెక్నాలజీ అనేది అన్ని రంగాల్లో కీలకంగా మారింది. ఒకప్పుడు మనిషిపై పడే పనిభారాన్ని టెక్నాలజీ చాలావరకు తగ్గించింది. ఎన్నో రంగాలలో మనిషి పనిని ఇది సులువు చేసింది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ ఎన్నో మార్పులు చేసుకుంటోంది. ఇప్పటికే రైతులకు ఎన్నో రకాలుగా సాయం చేస్తున్న టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దానికి డ్రోన్ల సాయాన్ని తీసుకోనున్నట్టు తెలుస్తోంది.


ప్రపంచవ్యాప్తంగా రైతులు పండిస్తున్న పంటల్లో అతి ముఖ్యమైనది వరి. వరి నుండి వచ్చే బియ్యాన్ని చాలావరకు దేశాల్లో ముఖ్య ఆహార పదార్థంగా భావిస్తారు. భూమిపైన జీవించే సగానికి పైగా మానవాలి జీవనం అన్నంతోనే కొనసాగుతోంది. అందుకే వరి పంటను పురుగులు, వ్యాధుల బారినుండి కాపాడడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మోడర్న్ అగ్రికల్చర్ విధానంలో వరి పంటను కాపాడుకోవడం చాలా ముఖ్యమని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా వరి పంటను నాశనం చేసే పురుగును వారు కనిపెట్టారు.

వరి పంటకు ఎన్నో పురుగులు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తాయి. కానీ వాటన్నింటిలో ఎక్కువగా నష్టం కలిగించే బ్యాక్టీరియా క్సాంథోమోనస్ ఒరిజే. ఈ బ్యాక్టీరియా వల్ల బ్యాక్టీరియల్ బ్లైట్ (బీబీ) అనే వ్యాధి పంటకు సోకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతీ ఏడాది బీబీ కారణంగా ఎన్నో లక్షల డాలర్లు విలువ చేసే పంట అంతా నాశనం అయిపోతుంది. అంతే కాకుండా దీనిని నివారించడానికి మరెన్నో లక్షల డాలర్లు ఖర్చు కూడా అవుతోంది. అందుకే తాజాగా శాస్త్రవేత్తలు దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు.


ప్రస్తుతం బీబీని అదుపు చేయడానికి వాటిని జన్యుపరంగా నిరోధించే పంటలను సాగు చేస్తున్నారు రైతులు. అయితే బీబీలో ఉండే పాథగాన్స్ ఎప్పటికప్పుడు తమ రూపాన్ని మార్చుకుంటూ పంటలో వేగంగా వ్యాపిస్తాయి. దానికి వల్ల దానికి తగినట్టుగా నిరోధించే పంటలను ఎప్పటికప్పుడు సాగు చేయడం కష్టంగా ఉంటుంది. అందుకే వారు ఎప్పటికప్పుడు వరిని కనిపెడుతూ ఉండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికోసం మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించడం సులభమైన మార్గమని వారు భావించారు.

వరి పంటను బీబీ నుండి కాపాడడానికి డ్రోన్ల సాయం తీసుకోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. ఈ డ్రోన్లు పంటలో ఏర్పడుతున్న బీబీని ఎప్పటికప్పుడు కనిపెడుతూ.. దానికి తగిన నిరోధక సాగులను తెలియజేసే విధంగా డిజైన్ చేయాలని వారు సన్నాహాలు చేస్తున్నారు. దీని వల్ల వరి పంటను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండడానికి రైతులు కష్టపడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఈ కొత్త టెక్నాలజీ కారణంగా వరి పంటల నష్టం కొంతవరకు అయినా తగ్గుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×