E-Paper
Advertisement

బండ్ల గణేష్ ఇంట ఆసక్తికర దృశ్యం.. సినీ, రాజకీయ ప్రముఖులు రాక, సీఎం చంద్రబాబుతో మైనంపల్లి-ఎర్రబెల్లి

బండ్ల గణేష్ ఇంట ఆసక్తికర దృశ్యం.. సినీ, రాజకీయ ప్రముఖులు రాక,  సీఎం చంద్రబాబుతో మైనంపల్లి-ఎర్రబెల్లి
Advertisement

Hyderabad: కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణలోని రాజకీయ పార్టీల నేతలు, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అంతేకాదు సీఎం చంద్రబాబు దంపతులు కూడా అటెండ్ అయ్యారు.

బండ్ల గణేష్ కూతురు ఎంగేజ్‌మెంట్ వేడుకలో ఆసక్తికర దృశ్యం

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కూతురు జనని-సూర్య తేజల ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం హైదరాబాద్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ మొదలు ఏపీ వరకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేవలం టాలీవుడ్ నుంచే కాకుండా ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు సైతం హాజరయ్యారు.

రాజకీయాలకు అతీతంగా నేతలంతా ఒకే వేదికపై కనిపించారు. నిశ్చితార్థ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు,  సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి బొత్స, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

Advertisement

సీఎం చంద్రబాబుతో మైనంపల్లి-ఎర్రబెల్లి.. తెలంగాణ రాజకీయాల్లో చర్చ

అలాగే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్, టీటీడీ ఛైర్మన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వద్దని వారిస్తున్నా కాళ్లు మొక్కి బండ్ల గణేష్ ఆశీర్వాదం తీసుకున్నారు. రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి ఒకే వేదికపై నేతలంతా కనిపించడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు.

సీఎం చంద్రబాబు చూడగానే కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. అటు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకరరావు కూడా సీఎం చంద్రబాబుకు నమస్కారం చేసి, ఆయన పక్కన నిలబడి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా నేతలు కాసేపు మాట్లాడుకున్నారు.

ALSO READ: ఆపరేషన్‌తో ప్రాణం.. చదువుతో విజయం.. కేటీఆర్ అండతో శరణ్య సాధించిన అద్భుతం!

గత ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వెళ్లిపోయిన నేతలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. నేతలు ఎవరూ నోరు ఎత్త లేదు.  ప్రస్తుతం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో పలువురు నేతలు  భేటీ కావడం ఫ్యూచర్‌ భవిష్యత్‌కు దారులు వేసుకుంటున్నారా? అనే చర్చ అప్పుడే మొదలైంది.  ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో ఏమైనా జరగవచ్చని అనుకుంటున్నారు.

 

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×