BigTV English

CM KCR vs Tummala: తుమ్మలపై కేసీఆర్ ఫోకస్.. నేతలతో అర్జెంట్ మీటింగ్!

CM KCR vs Tummala: తుమ్మలపై కేసీఆర్ ఫోకస్.. నేతలతో అర్జెంట్ మీటింగ్!

Tummala Nageswara rao latest news(Political news today telangana):

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కేసీఆర్‌ అభ్యర్థుల లిస్టు ప్రకటించడంతో అసంతృప్తి సెగలు చెలరేగడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఖమ్మంలో తుమ్మల వ్యాఖ్యలు మరింత కాకరేపుతుండటంతో జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఫోకస్‌ పెట్టారు గులాబీ బాస్. ఖమ్మం జిల్లా పార్టీ నేతలతో సాయంత్రం సీఎం కేసీఆర్‌ సమావేశంకానున్నట్టు తెలుస్తోంది. తుమ్మల అంశంపై ఏదో ఒకటి ఫైనల్ చేసే ఛాన్స్‌ ఉందని అంటున్నారు.


పాలేరు నుంచి బీఆర్ఎస్‌ టికెట్‌ ఆశించారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు. టికెట్‌ రాకపోవడంతో ఆవేదనకు గురైన తుమ్మల.. పెద్ద ఎత్తున బలప్రదర్శనకు దిగారు. అభిమానులతో మీటింగ్ పెట్టి తాను తప్పకుండా ఎన్నికల బరిలో దిగుతానంటూ ప్రకటించారు. దీంతో తుమ్మల కారు దిగేసి.. కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

బలమైన నేత తుమ్మల పార్టీని వీడితే.. ఖమ్మంలో బీఆర్ఎస్ పరిస్థితి కంగారే. ఇప్పటికే పొంగులేటి పోయారు. ఇప్పుడు తుమ్మల కూడా పోతే..? కారు ముందుకు కదిలేనా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో ఒక్క సీటే వచ్చింది. ఈసారి అదైనా వస్తుందా? అనే టెన్షన్‌లో ఉన్నారట కేసీఆర్.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×