Hyderabad Drug: హైదరాబాద్ నగర శివార్లలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టయింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు మేడ్చల్ లోని ఓ ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించి.. దాదాపు రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్:
మహారాష్ట్ర పోలీసులకు అందిన సమాచారం మేరకు.. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. మేడ్చల్ లో ఉన్న ఒక డ్రగ్స్ కంపెనీలో విస్తృతంగా తయారవుతున్న మూడు రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎక్స్ టీసీ (XTC), మోలీ, ఎండీఎంఏ (MDMA) వంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్ లో పోలీసులు సుమారు 32 వేల లీటర్ల ముడిసరుకు (రా మెటీరియల్) ను కూడా సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ తయారీలో నిమగ్నమైన 13 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అంతర్జాతీయ డ్రగ్స్ నెట్ వర్క్:
హైదరాబాద్‌లో తయారైన ఈ డ్రగ్స్ ను దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్‌కు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ దేశంలో డ్రగ్స్ తయారీ, సరఫరాకు సంబంధించి అతి పెద్ద కేసుల్లో ఒకటిగా నిలిచింది.