BigTV English

CM Revanth Reddy: తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Review Meeting

CM Revanth Reddy Review Meeting: వేసవిలో నీటి లభ్యతపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి గురువారం నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. వర్షపాతం లోటు, పలు రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజీ స్థాయిలకు నీరు చేరుతున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


ఈ సమావేశానికి మంత్రులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, తాగునీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

నీటి నిల్వ, అవసరాల వివరాలను పరిశీలించిన అనంతరం ప్రతి ఇంటికీ సరఫరా అయ్యేలా నీటిపారుదల, ఎంఏ అండ్‌ యూడీ, పంచాయతీరాజ్‌, తాగునీటి విభాగాలు సంయుక్తంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులను ఆదేశించారు.


Read More: గద్దెనెక్కిన సమ్మక్క.. నేడు మేడారానికి సీఎం రేవంత్, గవర్నర్ తమిళిసై..

కొరత ఉంటే ఎల్లంపల్లి, నాగార్జునసాగర్‌ల నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. నీటి సరఫరా కోసం నగరానికి నిర్దిష్ట సూక్ష్మస్థాయి ప్రణాళికను రూపొందించాలని ఆయన కోరారు.

నీటి ట్యాంకర్ల తరలింపును పోలీసులు అడ్డుకుంటున్నారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వేసవి ముగిసే వరకు నీటి ట్యాంకర్లను స్వేచ్ఛగా తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.

తాగునీటి అవసరాలను తీర్చేందుకు నాగార్జునసాగర్ నుంచి అనుమతించిన పరిమితులకు అదనంగా ఆంధ్రప్రదేశ్ 9 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తోందని, దీనిపై సరైన అంచనా వేసి నీటిని మళ్లించకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×