BigTV English

Condom Politics in AP: ఏపీలో కండోమ్‌ రాజకీయాలు.. ‘నిరోధ్’ స్థాయికి దిగజారిన టీడీపీ, వైసీపీ పాలిటిక్స్

Condom Politics in AP: ఏపీలో కండోమ్‌ రాజకీయాలు.. ‘నిరోధ్’ స్థాయికి దిగజారిన టీడీపీ, వైసీపీ పాలిటిక్స్
Andhra pradesh political news today

Condom Politics in Andhra Pradesh: ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్.. హాట్ గానే ఉంటాయి. ఇప్పుడు ఎన్నికల సీజన్ కాబట్టి మరింత హాట్ గా ఉన్నాయి. ఏపీ రాజకీయాలు. సోషల్ మీడియాలో అయితే సిగ్గుతో సోషల్ మీడియా వాడకం ఆపేసే స్థాయికి దిగజారాయి. ఏపీ రాజకీయాలు. కండోమ్ ప్యాకెట్లను కూడా వదలకుండా.. ప్రధాన పార్టీలు అయిన టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల శ్రేణులకు ఎలా ఉందో తెలియదు కానీ..సామాన్య జనానికి మాత్రం కంపరంగా కలిగించేలా ఉన్నాయి ఆంద్రా రాజకీయాలు.


రాజకీయాలు హుందాగా ఉండాలనేది ఒకప్పటి మాట.. రాజకీయం కోసం దేన్ని వదలొద్దనేది నేటి మాట. సోషల్ మీడియా వచ్చాక రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. తమ గురించి ప్రచారం చేసుకోవడానికి కాకుండా.. ప్రత్యర్థి ఆరోపణలు గుప్పించడానికి సోసల్ మీడియాను వాడేస్తున్నారు రాజకీయ పార్టీల నేతలు. తాజాగా.. టీడీపీ కండోమ్ ప్యాకెట్లను కూడా తమ రాజకీయాలకు వాడేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైసీపీ పార్టీ లోగో ఉన్న కండోమ్ ప్యాకెట్ ను టీడీపీ పోస్ట్ చేస్తే.. టీడీపీ సింబల్ ఉన్న కండోమ్ ప్యాకెట్ ను వైసీపీ ఓ వీడియోలో పోస్ట్ చేసింది. కండోమ్ ప్యాకెట్లను తమ ప్రత్యర్థి పార్టీల కేడర్ ఓటర్లకు పంచి పెడుతున్నారని ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపనలు గుప్పించుకుంటున్నాయి.

అమ్మఒడి పథకం కింద ఏపీ ప్రభుత్వం బడికెళ్తున్న పిల్లల తల్లులకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం కోసం టీడీపీ కండోమ్ ప్యాకెట్లను పంచిపెడుతోందని ఇద్దరు మాట్లాడుకోవడాన్ని వైఎస్సార్సీపీ షేర్ చేసిన వీడియోలో ఉంది. ‘త‌మ పార్టీ ప్రచారం కోసం టీడీపీ చివ‌రికి ప్రజ‌ల‌కు కండోమ్‌లు కూడా వదల్లేదు. ఇదెక్కడి ప్రచార పిచ్చి? నెక్ట్స్ వ‌యాగ్రాలు కూడా పంచుతారేమో? క‌నీసం అక్కడితోనైనా ఆగుతారా? లేక‌పోతే మున్ముందు ఇంకా దిగ‌జారుతారా?’’ అని చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌లను వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.


Read More: టీడీపీ, జనసేన మరో కీలక హామీ.. చర్చించిన నేతలు..

‘పబ్లిసిటీ కోసం ఎక్కడపడితే అక్కడ ఫొటోలు కనిపిస్తున్నాయి. అయ్యా.. ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకోవడం చూస్తుంటే శవాల మీద చిల్లర ఏరుకుంటున్నట్టుగా లేదా.. దీనికన్నా దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటాడా..?’ అంటూ జగన్ గతంలో చంద్రబాబు నాయుణ్ని విమర్శించిన ఆడియోతో.. వైఎస్సార్సీపీ గుర్తు ఉన్న కండోమ్ ప్యాకెట్ల వీడియో టీడీపీ సోషల్ మీడియాలో ఉంది. సిద్ధం..సిద్ధం అంటూ కేకలు పెట్టేది ఇందుకా? ఇలాంటి నీచపు ప్రచారాలు చేసే బదులు శవాల మీద చిల్లర ఏరుకోవచ్చు కదా వైఎస్సార్సీపీ..? అంటూ జగన్ పార్టీపై టీడీపీ సెటైర్లు వేసింది.

రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఏం అభివృద్ది పనులు చేస్తాం.. ప్రజల పేదరికాన్ని ఎలా నిర్మూలించాలో చెప్పుకోవాలి. అంతే కానీ కండోమ్‌లను సైతం వదలకుండా ప్రచారం చేయడం విడ్డూరం అనిపిస్తుంది. ఈ రాజకీయం ఎటు పోతుందో అని ఆంధ్రా జనాలు ముక్కున వేలుసుకుంటున్నారు. ఇంతకు సోషల్ మీడియా కోసమే ఆ కండోమ్ ప్యాకెట్లను మార్ఫింగ్ చేశారా..? లేదంటే నిజంగానే కండోమ్ ప్యాకెట్లను పంచబోతున్నారా..? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×