BigTV English

CM Revanth Reddy counter: తెలంగాణ.. విగ్రహ రాజకీయాలకు సీఎం రేవంత్ చెక్

CM Revanth Reddy counter: తెలంగాణ.. విగ్రహ రాజకీయాలకు సీఎం రేవంత్ చెక్

CM Revanth Reddy counter to BRS(Political news in telangana): తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒక రోజు నేతల జంపింగ్.. మరో రోజు పార్టీ విలీన రాజకీయాలు .. ఇంకో రోజు విగ్రహ రాజకీయాలు.. రేపేంటో? తెలంగాణలో విగ్రహ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వీటికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.


సోషల్‌మీడియా ట్రెండ్‌ని ఫాలో అవుతోంది బీఆర్ఎస్. నిత్యం ఏదో విధంగా వార్తల్లో ఉండాలని భావిస్తోంది. ఏ మాత్రం సైలెంట్‌గా ఉన్నా ప్రజలు తమను మరిచిపోతారని ఆలోచన చేస్తోంది. అందుకే రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తోంది. అధికార కాంగ్రెస్‌కు తామే అసలైన ప్రతిపక్షమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది.

గడిచిన నాలుగైదు రోజులుగా తెలంగాణలో పార్టీ విలీన రాజకీయాలపై ఎగతెగని చర్చ సాగింది. టీవీ డిబేట్లు, సోషల్‌మీడియా, బస్సుల్లో ఎక్కడ చూసినా కారు పార్టీ కమలంలో కలిసిపోతుందనే చర్చ సాగింది. పరిస్థితి గమనించిన బీఆర్ఎస్.. ఆ అంశాన్ని డైవర్ట్ చేయాలని నిర్ణయించింది.


ALSO READ: కవిత‌కు నిరాశ.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వచ్చేవారం

అధికార కాంగ్రెస్‌పైకి వివిధ అస్త్రాలను ఎక్కుపెట్టింది. వాటిని అధికార పార్టీ నేతల నుంచి కౌంటర్లు రావడంతో సైలెంట్ అయ్యింది.  పార్టీ విలీన రాజకీయాలను డైవర్ట్ చేసేందుకు కేటీఆర్.. విగ్రహ రాజకీయాలను తెరపైకి తెచ్చారన్నది కాంగ్రెస్ నేతల వాదన. దానికి తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు, అమరవీరుల స్థూపం పక్కన పెట్టాలని నిర్ణయించుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే ఆ విగ్రహాన్ని తొలగిస్తామంటూ బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటాన్ని తప్పుబట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు.

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని చెప్పకనే చెప్పారు. పదేళ్లగా తెలంగాణ తల్లి విగ్రహం ఆ పార్టీకి గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ విగ్రహం తీసినప్పుడు చెబితే మా జగ్గన్న వస్తారన్నారు. మా నైతికతను ప్రశ్నించాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పారు ముఖ్యమంత్రి. దీంతో కేటీఆర్ కామెంట్స్‌కు ఊహించని రీతిలో కౌంటరు ఇచ్చింది అధికార పార్టీ.

ఇంతకీ తెలంగాణలో పార్టీ విలీన రాజకీయాలు ఎంతవరకు వచ్చాయి? అన్నదే అసలు ప్రశ్న. విలీన రాజకీయాలు ఓ గవర్నర్ ద్వారా మంతనాలు జరిగినట్టు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి. కమలంతో కలిసి పోటీ చేయాలని గులాబీ పార్టీ భావించిందట. ఏకంగా విలీనం చేయాలని చెప్పడంతో.. అగ్గి మీద గుగ్గిలం అయ్యియిందట కారు పార్టీ.

విలీనం విషయంలో కారు పార్టీ ముఖ్యనేతలు రియాక్ట్ అయితే నిజంగానే చర్చలు జరిగాయని  ప్రజలు భావిస్తారు. అందుకే కేటీఆర్ ద్వారా స్టేట్‌మెంట్ ఇప్పించారని అంటున్నారు. ఒకవేళ విలీనం జరిగినా.. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు.  పైగా  దీనివల్ల కమలం కన్నా…  కారు పార్టీకే ఎక్కువగా లబ్ది చేకూరుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోంది. నిజంగా అవినీతి జరిగినట్టు తేలితే.. కారు పార్టీపై ప్రజలకు నమ్మకం పోతుందని అంటున్నారు. విలీన రాజకీయాలపై ఇప్పటికిప్పుడు కాకపోయినా, కొద్దిరోజుల తర్వాతైనా ఊపందుకోవడం ఖాయమని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

 

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×