E-Paper
Advertisement

Delhi News: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’.. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రముఖులకు ఆహ్వానాలు

Delhi News: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’.. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రముఖులకు ఆహ్వానాలు

Delhi News: ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు సీఎం రేవంత్‌‌రెడ్డి. గతరాత్రి హస్తినకు వెళ్లిన ఆయన, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిశారు. డిసెంబర్‌ 8-9 తేదీల్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. బుధవారం.. కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను కలిసి స్వయంగా ఆహ్వానాలు అందించనున్నారు.

ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ స‌మ్మిట్‌-2025 కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 8 -9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం మూడు వేల మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది రేవంత్ సర్కార్. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను ఆహ్వానిస్తున్నారు.

అలాగే అన్ని రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సమ్మిట్‌లో భాగంగా మూడు వేల డ్రోన్ల తో భారీగా షోను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఈ సమ్మిట్‌లో ప్రభుత్వం వివిధ సంస్థలతో కీలక ఒప్పందాల చేసుకోనుంది. అందుకోసం వ్యాపారవేత్తలు ముందుకొస్తున్నారు. సమ్మిట్‌లో ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఆహ్వానాలు అందజేత

దీనికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయితే బాగుంటుందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. రాష్ట్రాల వారీగా ఆ బాధ్యతలను తెలంగాణ మంత్రులకు అప్పగించారు.  ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేతలు, ఢిల్లీ సీఎం, ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఆహ్వానాలు అందించనున్నారు. జార్ఖండ్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు.

జమ్మూకాశ్మీర్, గుజరాత్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పంజాబ్-హర్యానా మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లనున్నారు.  ఇక కర్ణాటక, తమిళనాడులకు మంత్రి శ్రీధర్‌బాబు, యూపీకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజస్థాన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్, చత్తీస్‌గడ్ మంత్రి కొండ సురేఖ వెళ్లనున్నారు.

ALSO READ: వీధి కుక్కల సంరక్షణ.. జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు

బెంగాల్ మంత్రి సీతక్క, మధ్యప్రదేశ్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అస్సాంకు మంత్రి జూపల్లి కృష్ణా‌రావు, బీహార్‌కు వివేక్ వెంకటస్వామి, ఒడిషాకు మంత్రి వాకిటి శ్రీహరి, హిమాచల్ ప్రదేశ్‌కు మంత్రి లక్ష్మణ్ కుమార్, మహారాష్ట్రకు మంత్రి అజారుద్దీన్ వెళ్లి స్వయంగా సీఎంలకు ఆహ్వానాలు ఇవ్వనున్నారు.

ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులకు ప్రత్యేకంగా గిఫ్ట్ కిట్ ఇవ్వనుంది రేవంత్ ప్రభుత్వం. ప్రత్యేక బాస్కెట్లు, తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయా గిఫ్ట్ కిట్లు రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాల నుంచి కార్పొరేట్ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. అతిథులకు పోచంపల్లి ఇక్కత్ శాలువా, సావనీర్ కిట్ సత్కరించనున్నారు.

దీనికితోడు తెలంగాణ సంస్కృతి ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. చేర్యాల మాస్క్ పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హైదరాబాద్ అత్తర్, ముత్యాల ఆభరణాలు, తెలంగాణ సంప్రదాయ వంటకాలతో కల్చరల్ ఫుడ్, మహువ లడ్డులు, సకినాలు, అప్పాలు, బాదం కీ జాలి వంటివి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.

 

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×