BigTV English

TS Assembly: కాంగ్రెస్‌లోకి వచ్చేయ్.. సీఎం బంపరాఫర్.. నన్ను వదిలేయండన్న ఒవైసీ

TS Assembly: కాంగ్రెస్‌లోకి వచ్చేయ్.. సీఎం బంపరాఫర్.. నన్ను వదిలేయండన్న ఒవైసీ

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ ఒవైసీని కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుని డిప్యూటీ సీఎంగా తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని అన్నారు. దీనికి అక్బరుద్దీన్ ఒవైసీ వెంటనే రియాక్ట్ అయ్యారు. తాను మజ్లిస్ పార్టీలో సంతోషంగా ఉన్నానని చెప్పారు.


అసెంబ్లీలో ఈ రోజు ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణపై సీరియస్ చర్చ జరిగింది. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈ అంశాన్ని లేవనెత్తగా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యేకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే.. కాంగ్రెస్ బీఫామ్ పై కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించి గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. తానే చీఫ్ ఎన్నికల ఏజెంట్‌గా ఉండి అక్బరుద్దీన్ గెలుపు కోసం కృషి చేస్తానని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీగా చేసిన ఈ కామెంట్స్ పై అంతే ఫన్నీగా అక్బరుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు.

Also Read: ‘ఇదేం అన్యాయం’.. పీఎం మోదీకి కాంగ్రెస్ ఎంపీల లేఖ


కొడంగల్ నియోజకవర్గం నుంచి బీఫామ్ పై అక్బరుద్దీన్ ఒవైసీని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ చేశారు. గెలిపించుకుని అసెంబ్లీలో తన పక్కనే డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టుకుంటానని చెప్పారు. ఈ బంపర్ ఆఫర్ పై అక్బరుద్దీన్ వెంటనే స్పందించారు. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని వివరించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానని వివరించారు.

సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణకు అసెంబ్లీ హాల్ మొత్తం ఘొళ్లుమంది. సభ్యులంతా కాసేపు నవ్వుకున్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×