E-Paper
Advertisement

CM Revanth Reddy: విభజన హామీలపై క్లారిటీ ఇచ్చాకే.. మోదీ రాష్ట్రానికి రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: విభజన హామీలపై క్లారిటీ ఇచ్చాకే.. మోదీ రాష్ట్రానికి రావాలి: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy comments on modi(Telangana politics) : హయత్‌నగర్ నుంచి మెట్రోను విస్తరించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ వాసులకు కీలక హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ పదేళ్లలో తెలంగాణకు నిధులు, పరిశ్రమలు ఇవ్వలేదని విమర్శించారు.

మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి వనస్థలిపురం, ఎల్బీనగర్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ నియోజకవర్గం నుంచి సునీతకు 30వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Advertisement

వరద ముంపు సమస్యతో పాటుగా హయత్‌నగర్ నుంచి మెట్రోను త్వరలోనే విస్తరించే బాధ్యత తనదని వెల్లడించారు. తెలంగాణను నిండా ముంచేందుకే మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాకర్టీ కూడా ఇవ్వకుండా తరలించుకు పోయారని మండిపడ్డారు. మోదీ విభజన హామీలపై క్లారిటీ ఇచ్చిన తర్వాతనే రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు.

వరదలు వచ్చినప్పుడు బండిపోతే బండి ఇస్తామన్న బండి సంజయ్.. బండి రాలేదు గుండు రాలేదు అని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అరగుండు వచ్చి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Also Read: లోగుట్టు బయట పెట్టిన సీఎం, కారు.. కాకపోతే..

కేసీఆర్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ కారు పంక్చర్ అయిందని, అందుకే బస్సు పట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, కేసీఆర్‌ను ఫామ్‌ హౌస్‌కే పరిమితం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×